వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు భారీ యాగాలకు కేసీఆర్ ప్లాన్.. సాయంత్రం చినజీయర్ వద్దకు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత,భక్తి భావం గురించి అందరికీ తెలిసిందే. దైవాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతారు. శ్రీ తిదండి చినజీయర్ స్వామిని ఎక్కువగా అభిమానిస్తారు. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి గురువారం(మే 28) సాయంత్రం ఆయన వెళ్లనున్నారు. మర్యాదపూర్వకంగా చినజీయర్‌తో భేటీ కానున్న కేసీఆర్.. మే 29న ప్రారంభించనున్న కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించనున్నారు.

రెండు భారీ యాగాలు..

రెండు భారీ యాగాలు..


ఈ నెల 29న కొండ పోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గం.కు సీఎం కేసీఆర్‌ స్వయంగా కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తారు.అంతకంటే ముందు ఉదయం 4 గంటలకు కొండ పోచమ్మ దేవాలయంలో చినజీయర్ ఆధ్వర్యంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపు హౌజ్ వద్ద సుదర్శన యాగం నిర్వహిస్తారు. అలాగే ఉదయం 7గంటలకు కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మూడేళ్లలోనే పూర్తయిన ప్రాజెక్ట్

మూడేళ్లలోనే పూర్తయిన ప్రాజెక్ట్

కొండపోచమ్మ ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఉంది. కొండపోచమ్మ సాగర్‌ను 16 వందల కోట్ల వ్యయంతో 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అతి తక్కువ సమయంలో కేవలం మూడేళ్ల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మొత్తం 10 దశల్లో నీటిని తరలించగా.. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తున్న మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, రామడుగు, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ ద్వారా కొండపోచమ్మ సాగర్‌లోకి సాగునీరు రానుంది. దీంతో కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గ్రావిటీ ద్వారా 618మీ ఎత్తుకు చేరనున్నాయి. తద్వారా ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరే అవకాశం ఉంది.

ఆ పేరే ప్రాజెక్టుకు..

ఆ పేరే ప్రాజెక్టుకు..


ప్రాజెక్టు నుంచి 30కి.మీ దూరంలో జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లో కొండపోచమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయం పేరునే కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెట్టారు. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా 8ప్రధాన కాలువలను నిర్మించారు. గ్రావిటీ ద్వారా ప్రాజెక్ట్ నుంచి తొలుత సిద్దిపేట జిల్లాలోని 1,721 చెరువులకు నీటిని విడుదల చేయనున్నారు. ప్రారంభోత్సవం రోజు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు,జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు. యాగం నిర్వహించే స్థలాన్ని ఎంపీ సంతోష్ కుమార్,శృంగేరీ పండితుడు గోపీకృష్ణ శర్మతో కలిసి పర్యవేక్షించినట్టు సమాచారం.

English summary
The Kaleshwaram Lift Irrigation Scheme (KLIS) will cross a major milestone on May 29 when Chief Minister K Chandrasekhar Rao will release water from Kondapochamma Sagar Project, the highest point in KLIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X