వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వరదాయినిగా టీఆర్ఎస్ సర్కారు భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం 100 అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత అక్కడ మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభం అయ్యాయి. ప్రాజెక్టువద్ద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేసేందుకుగానూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లనున్నారు.

షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టుషాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆయన మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకోనున్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సీఎం సందర్శించనున్నారు. మేడిగడ్డ వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరడంతో..

 cm kcr to visit kaleshwaram project on tuesday as official stats lifting of 10.5 TMC

ఐదు నెలల విరామం తర్వాత కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్‌-1, 2లలో గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఆదివారం నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు కేసీఆర్‌ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించనున్న కేసీఆర్.. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టుunnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజ్‌‌. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసే విధంగా డిజైన్‌ చేసి 1.67 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజ్‌ పూర్తిచేశారు. దీనికి 85 గేట్లను అమర్చి కుడి, ఎడమ వైపున కర కట్టలు కట్టారు. కుడి(తెలంగాణ)వైపున 6.30 కిలోమీటర్లు, ఎడమ (మహారాష్ట్ర) వైపున 11.7 కిలో మీటర్లు కరకట్టలను నిర్మించారు.

English summary
Telangana Chief Minister K Chandrashekhar Rao to visit the Kaleshwaram Lift Irrigation Scheme (KLIS) project on tuesday. as project water level reaches 100feets, officials on Sunday decided to pump out 10.5 TMC water from Godavari River.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X