వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు యాదాద్రి వెళ్లనున్న సీఎం కేసీఆర్ .. ఆలయ నిర్మాణ పనుల పురోగతి పరిశీలించనున్న సీఎం

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేపు యాదాద్రి వెళ్లనున్న సీఎం కేసీఆర్..!! || Oneindia Telugu

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. అయితే పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించటానికి సీఎం కేసీఆర్ స్వయంగా యాదాద్రి వెళ్లనున్నారు.

<strong>ఓ డాక్టర్ కథ ..తన జీవితంలో మూడేళ్ళు మాయం .. అసలేం జరిగింది ?</strong>ఓ డాక్టర్ కథ ..తన జీవితంలో మూడేళ్ళు మాయం .. అసలేం జరిగింది ?

ఏప్రిల్ 17 బుధవారం నాడు సీఎం కేసీఆర్ ఉదయం 5.30 నుండి 6.30 మధ్య యాదాద్రి చేరుకుంటారని తెలుస్తుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ చాలా అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.

CM KCR to visit Yadadri on 17 April... To inspect construction works

అందులో భాగంగా అద్భుత శిల్పకళా ప్రతిభతో శిల్పులు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. మనోహరమైన శిల్ప సంపదకు, ఆధ్యాత్మికత ఉట్టిపడే రూప నిర్మాణాలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలవుగా మారనుంది.

గత రెండు నెలల క్రితం ఫిబ్రవరి ౩ న యాదాద్రి పనులను పరిశీలించిన కేసీఆర్ నిర్మాణ పనుల్లో పలు సూచనలు చేశారు . అయితే అప్పటి నుండి పనులలో పెద్దగా పురోగతి లేనందున సీఎం కేసీఆర్ స్వయంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

English summary
The Telangana Chief Minister K Chandrashekar Rao will be visiting Yadadri Lakshmi Narasimha Swami temple on Wednesday (17 April). Regarding the CM's visit, the temple officials have received the information for CMO. It's said that CM KCR will be reaching Yadadri in between 5:30 to 6:30 in the early morning. During the visit, the Chief Minister will inspect the temple development workers. In the last visit on 3 February, CM KCR has made few suggestions to the temple officials. Since two months passed, as there is no progress in the development works at the temple premises, KCR has decided to inspect the constriction works personally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X