వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలన

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం అభివృద్ధి పనులు పరిశీలించారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి సాధించేలా కేసీఆర్ యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే .

<strong>ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నా</strong>ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నా

యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ముందుగా యాదాద్రిలో జరుగుతున్న రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు సీఎం కేసీఆర్ . ఆ తర్వాత పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలించారు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం . అంతే కాదు యాదాద్రిలో తలపెట్టిన భారీ యాగం అయిన మహాసుదర్శన యాగం కోసం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు సీఎం స్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల స్థలం కావాల్సి ఉండడంతో అనువైన ప్రాంతం గురించి చర్చించనున్నారు సీఎం కేసీఆర్ . ఇక నేడు సాయంత్రం కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరుకుంటారు.

 యాదాద్రిలో మహా సుదర్శన యాగ సంకల్పం చేసుకున్న కేసీఆర్ .. నేడు స్థల పరిశీలన

యాదాద్రిలో మహా సుదర్శన యాగ సంకల్పం చేసుకున్న కేసీఆర్ .. నేడు స్థల పరిశీలన

యాదాద్రి నిర్మాణం పూర్తి కావస్తున్న నేపధ్యంలో యాదాద్రిలో సీఎం కేసీఆర్ భారీ యాగాన్ని తలపెట్టారు . అందుకోసం నేడు స్థల పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి ప్రాశస్త్యాన్ని తెలియజేయటంతో పాటుగా యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఆయన యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలిసిందే. మహా సుదర్శన యాగ నిర్వహణ, ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిసి కేసీఆర్ ఆయనతో చర్చించారు. జులై 30 మధ్యాహ్నం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్‌ యాగ నిర్వహణపై స్వామీజీతో చర్చించి యాదాద్రిలో యాగం చెయ్యాలని సంకల్పించారు.

యాదాద్రి విశిష్టతను తెలియజేసేలా కేసీఆర్ యాగం ..

యాదాద్రి విశిష్టతను తెలియజేసేలా కేసీఆర్ యాగం ..

యజ్ఞం నేపథ్యంలో లక్షలాది సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థల పరిశీలన చెయ్యనున్నారు సీఎం కేసీఆర్ . దీంతో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపైనా అధికారులతో చర్చించనున్నారు .ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులతో పాటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలలోని పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ఈ యాగానికి 3 వేల మంది రుత్వికులు వారికి సహాయకులుగా మరో 3 వేల మంది వేదం మంత్రోచ్చారణలతో యాగం నిర్వహించనున్నారు . ఇక యాగ నిర్వహణ కోసం 1048 యజ్ఞ కుండాలు ఏర్పాటు చేయనున్నారు. వైష్ణవ పీఠాలతో పాటు భద్రీనాథ్‌, శ్రీరంగం, జగన్నాథ్‌, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక యాగ నిర్వహణ కోసం అనువైన స్థల ఎంపిక సీఎం కేసీఆర్ చెయ్యనున్నారు.

English summary
Telangana Chief Minister KCR visited Yadadri Kshetra today. Telangana Chief Minister KCR visited the Yadadri Lakshminarasimhaswamy temple and worshipped the god . Officials and priests greeted the chief minister who came to inspect the temple's development works. The site seen of the Yadadri Shrine is going to be a place to conduct the Maha Sudarshana Yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X