వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానారెడ్డి ఇంటికెళ్లి భోజనం చేస్తా, టిడిపి టైంలో మంత్రిగా పని చేశా అందుకే: కేసీఆర్

తాను ముఖ్యమంత్రి అయ్యాక తనకు ఓ కల ఉండేదని, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని అనుకున్నానని సీఎం కేసీఆర్ మంగళవారం శాసన సభలో అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి అయ్యాక తనకు ఓ కల ఉండేదని, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని అనుకున్నానని, కానీ అంతలోనే ఉప ఎన్నికలు వచ్చాయని, త్వరలో ఆయన ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని సీఎం కేసీఆర్ మంగళవారం శాసన సభలో అన్నారు. పప్పు, పులుసు ఏది పెట్టినా తిని వస్తానన్నారు.

జనం సొమ్ము కాజేసిన వారిని జైలుకు పంపిస్తాం

ఇళ్లకు సంబంధించి అంశంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జనం సొమ్ము కాజేసిన వారిని జైలుకు పంపిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయానే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

కోమటిరెడ్డీ! నీ రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుంటున్నావ్: కేసీఆర్, వైయస్ పైన..కోమటిరెడ్డీ! నీ రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుంటున్నావ్: కేసీఆర్, వైయస్ పైన..

2004 నుంచి 2014 మధ్య ఇళ్ల విషయంలో అక్రమాలు జరిగాయన్నారు. విచారణ చేయాలని, దొంగలు ఎవరో బయటపడతారన్నారు. ఇల్లు కట్టకుండా ఎన్నికలకు పోతే ఏం అవుతుందో మాకు కూడా తెలుసునని చెప్పారు.

CM KCR want to lunch in Jana Reddy's home

జర్నలిస్టులకు కూడా ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఇళ్ల మీద ఉన్న అప్పులు మాఫీ చేస్తున్నామని, రాజీవ్ గృహకల్ప రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు.

టిడిపి హయాంలో మంత్రిగా చేశా అందుకే

తాను తెలుగుదేశం పార్టీ హయాంలో మూడేళ్ల పాటు మంత్రిగా పని చేశానని చెప్పారు. అందుకే రుణమాఫీ చేశానన్నారు.

నేను మాదిగ కులంలో పుట్టలేదు కానీ, కేసీఆర్‌కు థ్యాంక్స్: రేవంత్ రెడ్డినేను మాదిగ కులంలో పుట్టలేదు కానీ, కేసీఆర్‌కు థ్యాంక్స్: రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి నివాసం గురించి కాంగ్రెస్ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. ఇప్పుడు నిర్మించిన క్యాంప్ కార్యాలయం తన సొంత భవనం కాదన్నారు. అది ప్రభుత్వానిది అన్నారు. సీఎం నివాసంలో 150 గదులు ఉన్నాయనడం సరికాదన్నారు.

రూ.1500 కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. 14వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. 2.60 లక్షల ఇళ్లు కట్టి చూపిస్తామన్న ఆత్మవిశ్వాసం తమకు ఉందని చెప్పారు.

English summary
CM KCR want to lunch in Jana Reddy's home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X