వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ... పాల్గోననున్న సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్‌ 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో అక్టోబర్ 17నే టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. సభలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు. కాగా పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ఒక్కరోజు రోడ్ షో నిర్వహించారు. కాగా పలుసార్లు నియోజవర్గ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి, ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి పద్మావతి రెడ్డి బరిలో నిలవగా ఇద్దరి మధ్యే ప్రధాన పోటి కొనసాగనున్నట్టు సమాచారం.

సెప్టెంబర్ 23న హుజుర్‌నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ కుమార్ విడుదల చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా, 19వ తేదిన ప్రచారం ముగియనుంది. 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ మేరకు హుజర్ నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల ఏర్పాట్లను చేసింది. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి, ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి పద్మావతి రెడ్డి బరిలో నిలవగా ఇద్దరి మధ్యే ప్రధాన పోటి కొనసాగనుంది.

 CM KCR will campaign in Huzurnagar by-elections on 17th october

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. అయితే ఉప ఎన్నికల సంధర్భంలోనే ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో కష్టకాలం ఎదురైంది. దీంతో ఆర్టీసీ కార్మీకుల సమ్మె ఎఫెక్ట్ కూడ ఎన్నికలపై పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన సీపీఐ సైతం తమ మద్దతు ఉపసంహరించుకునేందుకు సన్నద్దమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గోనడం ద్వార ఓటర్లపై ఎలాంటీ ప్రభావం పడుతుందో వేచి చూడాలి.

English summary
CM KCR will be participating in public meeting in Huzurnagar constituency which going to be held on 17th october part of the by-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X