వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నుల వాటా విడుదలలో జాప్యం, శాఖలకు తప్పని కోతలు, నిర్మలా సీతారామన్‌కు కేసీఆర్ లేఖ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర పన్నుల వాటా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కోరారు. పన్నుల వాటా విడుదలపై కేంద్రం జాప్యం చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తమ నిధులను విడుదల చేయకపోవడంతో సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సి వస్తోందని చెప్పారు.

దేశంలో ఆర్థికమాంద్యం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మాంద్యం లేదని చెప్తుంది.. కానీ నిధులను మాత్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వాటా రూ.19719 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని చెప్పారు. కానీ 8 నెలల్లో రూ.10558 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.224 కోట్లు తక్కువ అని కేసీఆర్ గుర్తుచేశారు.

cm kcr wrote letter to finance minister nirmala sitharaman

ఆర్థిక పరిస్థితి, మాంద్యానికి సంబంధించి పార్లమెంట్‌లో మంత్రులు చెప్తున్న మాటలకు, వాస్తవానికి పొంతన లేదని సీఎం కేసీఆర్. పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళనకరంగా మారుతుందని అంచనా వేశారు. తమకు రావాల్సిన వాటాను రాకపోవడంతో తాము శాఖలకు కేటాయించే నిధుల్లో కోత విధించాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో అన్నిశాఖల ఖర్చుల్లో కోత పెట్టాల్సి వస్తోందని చెప్పారు.

ఆయా శాఖలు తమ వ్యయాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని సూచించారు. ఇదే అంశంపై త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తానని చెప్పారు. తమ పన్నుల వాటాలో కోత పెట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

English summary
cm kcr wrote letter to finance minister nirmala sitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X