• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం బాద్యతలు కేటీఆర్ కు..? స్వచ్చంద పదవీ విరమణ చేయనున్న కేసీఆర్..?! త్వరలో జిల్లాల పర్యటన..!!

|
  KTR కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా KCR || KCR Wanted To Give CM Responsibilities To KTR

  హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరగబోతున్నాయా..? ప్రగతి భవన్ వేదికగా ముఖ్య నేతల మద్య జరుగుతున్న సంప్రదింపుల ఆతర్యం ఏంటి..? తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మనసులో అదే ఆలోచన ఉంటే వినాయక చవితి నిమజ్జనోత్సవం తర్వాత దాన్ని ఆచరణలో పెట్టబోతున్నారా..? ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో తండ్రి కొడుకుల మద్య జరిగిన రాజకీయం తెలంగాణలో పునరావృతం కాబోతోందా..? తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యంగా అదికార మార్పు జరగబోతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్బవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన చంద్రశేఖర్ రావు రెండవసారి కూడా తెలంగాణలో అదికారాన్ని కైవసం చేసుకోగలిగారు. ఇదే ఆదిపత్యాన్ని కొనసాగించేందుకు వినూత్న అడుగులు వేయబోతున్నారు చంద్రశేఖర్ రావు.

  తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పు..!కేసీఆర్, కేటీఆర్ నేతలతో మంతనాల ఆంతర్యం అదేనా..?

  తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పు..!కేసీఆర్, కేటీఆర్ నేతలతో మంతనాల ఆంతర్యం అదేనా..?

  ఇంతకీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల తారకరామారావు కు చంద్రశేఖర్ రావు పూర్తి బాద్యతలు కట్టబెడతారని, అందులో బాగంగా చంద్రశేఖర్ రావు స్వచ్చంద పదవీ విరమణ చేయబోతున్నారని ప్రగతిభవన్ వేదికగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల గులాబీ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా పెత్త ఎత్తున ప్రతిస్పందన వస్తూండడంతో పార్టీ శ్రేణులతో పాటు అధినాయకత్వంలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటను శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన సందర్బంగా ప్రజల రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని చంద్రశేఖర్ రావు ఉవ్విళూరుతున్నట్టు తెలుస్తోంది.

   సీఎం బాద్యతలు కేటీఆర్ కు..! తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు తప్పవా..?

  సీఎం బాద్యతలు కేటీఆర్ కు..! తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు తప్పవా..?

  తెలంగాణలో అదికారంలో ఉన్న గులాబీ పార్టీకి ప్రజల నుంచి మంచి మద్దత్తు ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు కూడా ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఇదే తరుణంలో తన పదవిని కుమారుడు కేటీఆర్ కు కట్టబెట్టి, తాను పార్టీ వ్యవహారాల పట్లు దృష్టి పెట్టాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఇటీవల ప్రగతి భవన్ లో చంద్రశేఖర్ రావు అతి ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇటు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గులాబీ ముఖ్య శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండం గమనార్హం. సమావేశాల గురించి మీడియాతో ఎక్కాడా చర్చించొద్దనే గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు నాయకులు చెప్పడం విశేషం. అంటే అటు ప్రగతి భవన్ సమావేశాల్లో చంద్రశేఖర్ రావు సంప్రదింపులు, ఇటు తెలంగాణ భవన్ లో కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశాల వెనక ఏదో మతలబు నడుస్తున్నట్టు తెలుస్తోంది.

  త్వరలో కేటీఆర్ కు బాద్యతల అప్పగింత..! ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్న చర్చ..!!

  త్వరలో కేటీఆర్ కు బాద్యతల అప్పగింత..! ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్న చర్చ..!!

  ఇక ప్రతిపక్షాలు ఏదైతే అంశాన్ని అస్త్రంగా ఎంచుకుని గులాబీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లలని పథకం రచించాయో అదే అస్త్రాన్ని తిరిగి వారి మీదకే ప్రయోగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. అందుకోసం జిల్లాల బాట పట్తి సాగు-త్రాగు నీటి అంశంలో ప్రభుత్వం ఎంత చిత్త శుద్దితో పనిచేసిందో ప్రజలకు వివరించాలని వ్యూహం రచిస్తున్నారు చంద్రశేఖర్ రావు. ప్రతిపక్షాలు జల ఆయుధాన్ని విమర్శానాస్త్రంగా ఎంచుకుని గులాబీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో బాగంగా తుమ్మిడిహట్తి ప్రాజెక్టు దగ్గర హడావిడి చేసింది. దీన్ని తిప్పికొట్టేందుకు చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకు తీసుకు రాబోతున్నారు.

   పార్టీ వ్యవహారాలను చూసుకోనున్న కేసీఆర్..! యువ సీఎం అభ్యర్ధిత్వం పై ప్రజల మూడ్ తెలుసుకోనున్న బాస్..!!

  పార్టీ వ్యవహారాలను చూసుకోనున్న కేసీఆర్..! యువ సీఎం అభ్యర్ధిత్వం పై ప్రజల మూడ్ తెలుసుకోనున్న బాస్..!!

  అంతే కాకుండా సెప్టెంబర్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం అదికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల గురించి ఓ అవగాహన వచ్చిన తర్వాత జిల్లాల పర్యటన చేయాలనేది చంద్రశేకర్ రావు వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాల పర్యటనల్లో త్రాగు-సాగునీటి అంశాలే కాకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పై ప్రజల మూడ్ తెలుసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణకు ముందు ఒకసారి ప్రజల్ని స్వయంగా కలిసేందుకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు జిల్లాల బాట పడుతున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడేళ్ల స్వల్ప వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన వైనాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నదే చంద్రశేఖర్ రావు పర్యటన లక్ష్యంగా కనపడుతోంది. త్వరలో చంద్రశేఖర్ రావు టూర్ షెడ్యుల్ ఖరారయ్యే అవకాశం ఉంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After Chief Minister Chandrashekhar Rao, Kcr's son Kalakuntla Tarakarama Rao, who plays a key role in Telangana politics, Chandrasekhar Rao is going to retire and the cm responsibilities giving to KTR. There are whispers in the Pragabhavan platform.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more