• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్‌డౌన్ పై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న హోం మంత్రి.!ముగిసిన పోలీస్ ఉన్నతాదికారుల సమీక్ష.!

|

హైదరాబాద్ : పోలీస్ శాఖ గత సంవత్సరం నుండి కరోనా మొదటి దశలో చాలా సమర్ధవంతంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్ వేవ్ నేపధ్యంలో కూడా పటిష్టంగా పనిచేస్తోందని హోం మంత్రి పేర్కొనారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ ముందుంటుందని, ఎప్పటిలాగే క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, మెడికల్ & హెల్త్ మరియు జి.హెచ్.యం.సి. శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం, రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదని, రేమేడిసివిర్ ఇంజక్షన్ మొదలగు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేసారు.

 ఆక్సిజన్ ను బ్లాక్ మార్కెట్ చేయొద్దు.. చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హోంమంత్రి..

ఆక్సిజన్ ను బ్లాక్ మార్కెట్ చేయొద్దు.. చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హోంమంత్రి..

అయితే, చాలామంది భయంతోనో ముందు జాగ్రత్త తో, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు ఇళ్ళల్లో నిలువ చేసుకొంటున్నట్లు దృష్టికి వచ్చిందని, దీనివల్ల, సిలిండర్ల తాత్కాలిక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. అదేవిధంగా మందులు పాడైపోయే ప్రమాదం ఉందని, ప్రజలు ఈ విషయంలో ఆందోళన పడి, అవసరం లేకపోయినా నిలువ చేసుకోవద్దని, ప్రభుత్వం ఆక్సిజన్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అందుబాటులో ఉంచడానికి పటిష్ట చర్యలు తీసుకుందని తెలిపారు. ఆక్సిజన్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై పోలీస్ ఉక్కుపాదం మోపుతుందని, అట్టివారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్ దందాకు ఆస్కారం ఇవ్వబోమని, దీనిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారని హోం మంత్రి పేర్కొన్నారు.

 కరోనా కట్టడిపై పోలీస్ ఉన్నతాదికారులతో సమీక్ష.. లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం ఉంటుందన్న మహమూద్ ఆలీ..

కరోనా కట్టడిపై పోలీస్ ఉన్నతాదికారులతో సమీక్ష.. లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం ఉంటుందన్న మహమూద్ ఆలీ..

ప్రజలందరూ తప్పకుండా కరోనా జాగ్రతలు పాటించాలని, మాస్కులు విధిగా ధరించాలని, అవసరమైతే తప్ప బయటకి రాకుండా ఉండాలని, బయటకి వెళ్ళినప్పుడు విధిగా భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడ్డుక్కోవాలని, సానిటైజ్ చేసుకోవాలని హోం మంత్రి విజ్ఞప్తి చేసారు. ప్రజా సమావేశాల పై నిషేధం ఉందని, హై కోర్ట్ కుడా ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చిందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని హోం మంత్రి కోరారు. రంజాన్ మాసం నడుస్తున్న కారణంగా, ముస్లీం సోదరులు, నమాజ్, తరావీలు చేసే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. జ్వరం, జలుబు మొదలగు ఇబ్బందులు ఉంటే, ఆలస్యం చేయకుండా, వెంటనే కరోన పరీక్ష చేసుకుని, వైద్యం చేయించుకోవాలని, నిర్లక్ష్యం, కాలయాపన చేస్తే వ్యాధి తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హోం మంత్రి పేర్కొన్నారు.

 ఆసుపత్రులలో పడకలు పెంచాం.. ఆందోళన వద్దన్న హోంమంత్రి

ఆసుపత్రులలో పడకలు పెంచాం.. ఆందోళన వద్దన్న హోంమంత్రి

రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో పడకలు పెంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ఈ రోజు హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు చికిత్స కొరకు ప్రజలు వస్తున్నారని, ప్రభుత్వం ప్రజల చికిత్స కొరకు అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో వదంతులు, ఇతర అసత్య ప్రచారాలకు పాల్పడితే, కటిన చర్యలు తప్పవని హోం మంత్రి అన్నారు. ఈ పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందు ఉండాలని, పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. పోలీస్ శాఖ ప్రజాసేవ కొరకు ఎల్లప్పుడూ ఉంటుందని మహమూద్ అలీ పేర్కొన్నారు.

  TS : Include COVID-19 Treatment Under Aargoyasri : Seethakka
   లాక్‌డౌన్ పై సీఎం నిర్ణయం తీసుకుంటారు.. స్పష్టం చేసిన మహమూద్ ఆలీ..

  లాక్‌డౌన్ పై సీఎం నిర్ణయం తీసుకుంటారు.. స్పష్టం చేసిన మహమూద్ ఆలీ..

  రాష్ట్రంలో కోవిడ్-19 రెండవ దశ నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బుధవారం నాడు లక్షీకాపూల్ లోని కార్యాలయంలో, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ ఎం భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమీషనర్ అనిల్ కుమార్ లతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై, వివిధ విషయాలపై, పరిస్థితుల పై సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్ పై తీసుకోబోయే కీలక నిర్ణయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే తీసుకుంటారని హోంమంత్రి స్పష్టం చేసారు.

  English summary
  The Home Minister said that the police department had worked efficiently in the first phase of the Corona last year and is now working solidly even in the wake of the second wave.The Home Minister made it clear that the key decision on the lockdown would be taken by Chief Minister Chandrasekhar Rao himself.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X