వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడి ఫోన్ కాల్ ఫేక్.. సీఎంవో క్లారిటీ.. పోలీసులకు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు . తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ఒక వైపు , సమ్మె చేస్తున్న పట్టించుకోకుండా మొండి వైఖరితో ప్రవర్తిస్తున్న ప్రభుత్వ తీరు మరోవైపు వెరసి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో స్కూళ్లకు కాలేజీలకు సెలవులను పొడిగించడంపైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసమయంలోనే ఒక ఫోన్ కాల్ పై పెద్ద చర్చ జరిగింది.

 సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్

ఇక ఈ నేపథ్యంలోనే సీఎంవో కార్యాలయానికి సామాన్యులు ఫోన్స్ చేస్తున్నారని తాజాగా ఒక సామాన్యుడు చేసిన ఫోన్ కాల్ పై మీడియాలో , సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. , ఏకంగా సీఎంవో హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఇదేం పద్ధతి అని నిలదీశారని , సీఎం కేసీఆర్ తీరుపై గట్టిగానే మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. అయితే అదంతా ఫేక్ అంటున్నారు తెలంగాణా సీఎంఓ అధికారులు .

 CMO officials clarified that a common man phone call is fake ... Complaint to the police

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి ఓ సామాన్యుడు ఫోన్ చేశారని , కార్యాలయ సిబ్బంది బదులిచ్చారని వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలంగాణ సీఎంవో స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. సీఎం కార్యాలయానికి ఫోన్ చేసిన సామాన్యుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తన గోడు వెళ్లబోసుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ సీఎంవో స్పష్టతనిచ్చింది. ఆ వ్యక్తితో సీఎం కార్యాలయ సిబ్బంది ఫోన్ లో మాట్లాడినట్టు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని తెలిపింది. దీనిపై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరామని తెలంగాణ సీఎంవో అధికారులు వెల్లడించారు.

తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైన్‌కు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లుగా గత రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా దుష్ప్రచారం జరుగుతున్నదని సీఎంఓ పేర్కొంది . సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని సీఎంఓ పేర్కొంది . దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు అని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ వేదికగా స్పష్టతనిచ్చింది.

English summary
Recently a news was spread in telangana that a common man Ranjit Kumar from Karimnagar district called the CMO helpline and expressed his opinion .but the CMO officials said that it was fake and they complained to the police totake action on this fake phone call .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X