హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుజాతి రత్నం: ఘనంగా సినారె జన్మదిన వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాహితీవేత్త సి నారాయణ రెడ్డిని తెలుగు జాతికే గర్వకారణం అనడంకన్నా.. యావత్ ప్రపంచానికే గర్వకారణం అనడం సరైందని ఉమ్మడి రాష్ట్రాలలోకాయుక్త జస్టిస్ బి సుభాషణ్‌రెడ్డి అన్నారు. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సి నారాయణరెడ్డి 85వ జన్మదినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సినారెకు కవి అనే పదం చాలా చిన్నదని, ఆయన ఒక వక్త, ఉపన్యాసకుడు, గాయకుడు, అత్యున్నత మానవతావాదని, అవన్నీ కలబోసిన సినారె.. ఒక సాహిత్య సంస్థ అన్నారు. సమానత్వం గురించి చాలా కవిత్వం రాశారని చెప్పారు. తుపాకీ(గన్) కంటే కలమే(పెన్) గొప్పదని అంటారని సుభాషణ్‌రెడ్డి తెలిపారు.

గీతాలాపన

గీతాలాపన

సాహితీవేత్త సి నారాయణ రెడ్డిని తెలుగు జాతికే గర్వకారణం అనడంకన్నా.. యావత్ ప్రపంచానికే గర్వకారణం అనడం సరైందని ఉభయ రాష్ట్రాల లోకాయుక్త బి సుభాషణ్‌రెడ్డి అన్నారు.

సినారె

సినారె

వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సి నారాయణరెడ్డి 85వ జన్మదినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సినారె పుస్తకావిష్కరణ

సినారె పుస్తకావిష్కరణ

సినారెకు కవి అనే పదం చాలా చిన్నదని, ఆయన ఒక వక్త, ఉపన్యాసకుడు, గాయకుడు, అత్యున్నత మానవతావాదని, అవన్నీ కలబోసిన సినారె.. ఒక సాహిత్య సంస్థ అన్నారు.

జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలు


సమానత్వం గురించి చాలా కవిత్వం రాశారని చెప్పారు. తుపాకీ(గన్) కంటే కలమే(పెన్) గొప్పదని అంటారని సుభాషణ్‌రెడ్డి తెలిపారు. ‘క్షేత్రబంధం' పుస్తకంలోని ప్రతి పద్యంలో చాలామంచి అర్థం ఉందని అన్నారు.

జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలు

ఈ సందర్భంగా సినారెను సత్కరించారు. సినారె రాసిన క్షేత్రబంధం గ్రంథాన్ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని స్వీకరించిన హూస్టన్ తెలుగు అసోసియేషన్ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరిని సత్కరించారు.

‘క్షేత్రబంధం' పుస్తకంలోని ప్రతి పద్యంలో చాలామంచి అర్థం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సినారెను సత్కరించారు. సినారె రాసిన క్షేత్రబంధం గ్రంథాన్ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని స్వీకరించిన హూస్టన్ తెలుగు అసోసియేషన్ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరిని సత్కరించారు.

నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కవితా క్షేత్రానికి ముందు నాగలిపట్టి పొలాన్ని దున్నానని, ఆ సంఘటన గుర్తుకు వచ్చి ‘క్షేత్రబంధం' అనే పేరు పెట్టానని అన్నారు. సభకు అధ్యక్షత వహించి కెవి రమణాచారి మాట్లాడుతూ.. సినారె జన్మదినోత్సవాన్ని కవి సార్వభౌమానికి జరిగిన పట్టాభిషేకంగా అభివర్ణించారు.

శారద ఆకునూరి.. సినారె రాసిన కొన్ని పాటలలోని మొదటి వాఖ్యాలను జోడించి అభినందన మందారమాలగా తన గానంతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలుకగా, సినారె సాహిత్యంతో గీతాంజలి స్వాగత గీతం ఆలపించింది.

తొలుత సినారె కలం నుండి జాలు వారిన పలు పాటలను శారద, గీతాంజలి, వినోద్‌బాబు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి మురళి వెన్నెంగారు, వాడ్రేవు చిన వీరభద్రుడు పాల్గొన్నారు.

English summary
Literary scholar C Narayana Reddy's birthday celebrations held in Ravindra Bharathi, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X