వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతి

|
Google Oneindia TeluguNews

రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్‌మెన్ నవీన్ మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.

గనిలో మూడో సీమ్ 66 లెవల్ 44 డీప్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ప్రమాద స్థలానికి దగ్గరలో పనిచేస్తున్న ఓవర్‌మెన్ గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన రెస్కూ బృందాలు నవీన్ మృతదేహాన్ని గుర్తించి బయటికి తీశాయి.

 coal mine in Telangana collapses: one killed

ఘటన సమయంలో అక్కడే ఎల్‌హెచ్‌డీ యంత్రంపై పనిచేస్తున్న ఆపరేటర్ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు.

కాగా, సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) అనేది ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్ సంస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం, ఎస్‌సిసిఎల్ తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 18 ఓపెన్‌కాస్ట్, 27 భూగర్భ బొగ్గు గనులను 48,000 మందికి సిబ్బందితో నిర్వహిస్తోంది.

English summary
coal mine in Telangana collapses: one killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X