హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొండాం నుంచి నేరుగా ప్యాకెట్‌లోకి కొబ్బరి నీరు, త్వరలో టెక్నాలజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొబ్బరి బొండాల నీటి తాజాదనం, సువాసనలు ఏమాత్రం కోల్పోకుండా నేరుగా ప్యాకింగ్ చేసేందుకు ఉపకరించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) విస్తృత ప్రయోగాలు చేస్తోంది.

ప్యాక్ చేసిన కొబ్బరి బొండాం నీరు తన తాజాదనాన్ని కోల్పోకుండా మరంత కాలం పాటు మన్నికగా ఉంచాలనే లక్ష్యంతో వారు పని చేస్తున్నారు. ప్రస్తుతం థెర్మల్ ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా కొబ్బరి బొండాం నీటిని నిలువ ప్యాకింగ్ చేస్తున్నారు.

Coconut water to get new packaging

అయితే, ఈ ప్రక్రియలో కొబ్బరి నీటి సువాసన మారుతున్నట్లుగా గుర్తించారు. కొబ్బరి బొండాంలో నుంచి తీసిన నీటిని ప్యాకెట్లోకి నింపగలిగే సాంకేతిక పరిజ్ఞానం తయారీలో ఇప్పుడు తలమునకలుగా ఉన్నట్లు ఐఐపీ తెలిపింది.

ఐఐపీ టెక్నాలజీ ద్వారా కొబ్బరి నీళ్లు ప్యాకేజింగ్ అయ్యాక.. వాటి తాజాదనం 28 రోజుల వరకు ఉంటుంది. 200 మిల్లీ లీటర్లకు రూ.10 అవుతుంది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్సీ సాహా మాట్లాడుతూ.. కేరళ వంటి ప్రాంతాలకు తమ ప్రయోగం బాగా పనికి వస్తుందని చెప్పారు.

English summary
The Indian Institute of Packaging (IIP) is developing a new packaging technology for tender coconut water to enhance its shelf life while also retaining the natural flavour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X