ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో చలి పంజా: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జంకుతోన్న జనం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెడుతుంది. ఉదయం 9 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పనుల కోసం జనాలు బయటకు వస్తున్నారు. ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి చలి ప్రభావం మొదలవుతోంది. 6 గంటల వరకే చిమ్మచీకటి ఉంటుంది. రాత్రి 11 గంటలు దాటితే.. మంచు కురవడం ప్రారంభమవుతోంది.

తెలంగాణ ఊటీ ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మొన్నటి వరకు 17 నుంచి 20 డిగ్రీల వరకు ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మంగళవారం 14.7 డిగ్రీలకు పడిపోయాయి. భద్రాచలంలో 16.6, హైదరాబాద్‌లో 17.2, రామగుండంలో 17, మెదక్‌లో 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

cold in telangana state

Recommended Video

Russia's Sputnik V COVID 19 Vaccine Reached HYD, క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించనున్న Dr Reddy’s Lab!

బురెవి తుపాన్‌తో రాష్ట్రంలో శీతల వాతావరణం నెలకొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. దీంతో పిల్లలు, వృద్దులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పట్టడంతో ప్రికాషన్స్ మస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు. బయటకు వచ్చిన సమయంలో మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని చెబుతున్నారు. చలిలో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు.

English summary
cold in telangana state. low temperature recorded in adilabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X