రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి- ఉత్తమ్ : రావద్దు - వచ్చి తీరుతాం : రాహుల్ టూర్ వేళ మరోసారి..!!
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారటం లేదు. అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న వేళ..కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతం వుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారాలు మరసారి పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. వచ్చే నెలలో పార్టీ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటన ఖరారైంది. అందులో భాగంగా మే 6న వరంగల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఆ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను సమీకరించటంతో పాటుగా...టీపీసీసీ చీఫ్ రేవంత్ జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసారు.

రాహుల్ పర్యట వేళ..విభేదాలతో
జిల్లాలకు భాధ్యులను నియమించారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటనకు సిద్దమయ్యారు. కానీ, రేవంత్ జిల్లాకు రావాల్సిన అసవరం లేదంటూ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, రేవంత్ వర్గం మాత్రం తాము సమావేశం ఏర్పాటు చేసి తీరుమతాని చెప్పటం కొత్త వివాదానికి కారణమవుతోంది. జిల్లా కు చెందిన ఎంపీలు ఇద్దరూ.. వరంగల్ సభకు జనసమీకరణకు తామే ఏర్పాట్లు చేసుకుంటామని... పీసీసీ నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

నల్గొండకు రేవంత్ అవసరం లేదంటూ
నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ను పీసీసీ ఆదేశించింది. సీనియర్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిని.. పీసీసీ స్థాయిలోనే ఆహ్వానించాలని శంకర్‌నాయక్ ను కోరినట్లు తెలిసింది. అయితే, వారిని ఆహ్వానించినా వారు హాజరవుతారా లేదా అనేది సందేహంగానే కనిపిస్తోంది.
కానీ, రేవంత్ మద్దతు దారులు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నల్గొండలో పీసీసీ అధ్యక్షుడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. చౌటుప్పల్‌లో వందమందికిపైగా నేతలు రహస్యంగా సమావేశమయ్యారు.

రహస్య సమావేశం... రేవంత్ కు మద్దతుగా
వీరంతా రేవంత్ పర్యటనను విజయవంతం చేయాలంటూ నినాదాలు చేశారు. పార్టీలో సినియర్లుగా ఉంటున్న వారే సమస్యలకు కారణమవుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సీనియర్లకు వ్యతిరేకంగా ఒక వర్గం నేతలు ఏఐసీసీకి తాజా పరిస్థితుల పైన లేఖ రాయాలని నిర్ణయించారు.
తాజాగా..ఢిల్లీలో తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశం అయిన రాహుల్ గాంధీ అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్దేశించారు. రాహుల్ రాష్ట్రానికి ఆహ్వానించిన సీనియర్లు..ఆయన పర్యటన సమయంలో సన్నాహక సమావేశాల నిర్వహణలోనే ఈ విధంగా వ్యవహరిస్తుంటే.. ఇక, సభ నాటికి ఈ పరిణాలు ఎటువంటి టర్న్ తీసుకుంటాయనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.