కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ టీఆర్ఎస్‌లో కోల్డ్‌వార్: మున్సిపల్ ఎన్నికల వేళ .. ఆ గులాబీ నేతలకు మంత్రి గంగుల వార్నింగ్

|
Google Oneindia TeluguNews

మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కరీంనగర్ లో టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన వార్నింగ్ పార్టీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది . తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు... కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదంటున్న మంత్రి గంగుల కమలాకర్ ఈ వార్నింగ్‌ ఎవరికి ఇచ్చారు ? అసలు కరీంనగర్ గులాబీ దళంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

కరీంనగర్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మంత్రి గంగుల కమలాకర్

మొన్నటి వరకు జిల్లా రాజకీయాలను మంత్రి ఈటెల రాజేందర్ శాసించారు. ఇక ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కమలాకర్ తన ఆధిపత్యం చెలాయించటానికి పావులు కదుపుతున్నారని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అందుకు రానున్న మున్సిపల్ ఎన్నికలను ఆయన తన పట్టును ప్రదర్శించే వేదికగా చేసుకుంటున్నారని టాక్ . గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కను లోత్తపోయిన చందంగా బయట పడ్డారు గంగుల కమలాకర్ .

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు వెన్నుపోటు పొడిచిన నాయకులకు వార్నింగ్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు వెన్నుపోటు పొడిచిన నాయకులకు వార్నింగ్

అయితే ఆ సమయంలో సొంత పార్టీ నాయకులు కొంత మంది తనకు వ్యతిరేకంగా పని చేశారని గుర్తించిన ఆయన అప్పుడు వారిని ఏమీ అనలేదు. ఇక తాజాగా మునిసిపల్ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో వారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . కొంతమంది తన ఓటమికి పని చేశారన్న విషయాన్ని ప్రస్తావించకుండా కమలాకర్ వారికి అర్ధం అయ్యే రీతిలో వార్నింగ్ ఇచ్చారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు... కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదని ఆయన చాలా గట్టిగానే చెప్పారు .

తనకు సహకరించని వారి పేర్ల లిస్టు .. ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుండా వ్యూహం

తనకు సహకరించని వారి పేర్ల లిస్టు .. ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుండా వ్యూహం

ఇక అందులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి లిస్టును తయారు చేసి పెట్టుకున్న కమలాకర్ ఇప్పుడు వారిని ఏరిపారేసే పనిలో ఉన్నారని సమాచారం. వెన్నుపోటుదారుల లిస్టులో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో పాటు సిటింగ్ కార్పొరేటర్లు ఉన్నారంటూ పార్టీలో ప్రచారం జరుగుతుంది . అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్‌ను ఓడించేందుకు వారంతా గట్టిగా ప్రయత్నించారని బీజేపీ నేతలకు వారు పరోక్షంగా సహకరించారని సమాచారం.

మాజీమేయర్ తో పొసగని గంగుల .. ఏం చేస్తారో ?

మాజీమేయర్ తో పొసగని గంగుల .. ఏం చేస్తారో ?

ఇక తాజాగా మంత్రి గంగుల చేసిన వ్యాఖ్యలు మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌, గంగుల వీరిద్దరికీ పొసగడం లేదన్న ప్రచారానికి మరింత ఊతం ఇస్తున్నాయి .కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలను మంత్రి గంగుల చాలెంజింగ్‌గా తీసుకుంటున్న నేపధ్యంలో ఆయన కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ కరీంనగర్ లో ఉన్న రాజకీయాలు, సొంత పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ కరీంనగర్ లో ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది.

English summary
Tensions are looming in the TRS party in Karimnagar as municipal elections are nearing. The recent Warning issued by Minister Gangula Kamalakar has revealed that there is cold war in TRS in Karimnagar . Gunga Kamalakar, the minister of state, gave the news that under no circumstances will he be excused if the party is suffering from back attackers. what happens in Karimnagar TRS party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X