వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత రాజకీయ భవితవ్యం పైన కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ ?

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ? సీఎం కేసీఆర్ కవిత విషయంలో ఇంకా ఏమీ ఫైనలైజ్ కాలేకపోతున్నారా ? సీఎం కేసీఆర్ తన కుమార్తె కవిత రాజకీయ భవిష్యత్ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారా? అంటే అవును అనే చర్చ గులాబీ పార్టీ శ్రేణుల్లోనే కాదు సీఎం కేసీఆర్ ఇంట్లో కూడా కొనసాగుతుంది అనే చర్చ జరుగుతుంది.

డిప్యూటీ సీఎంగా కేటీఆర్ ..? సీనియర్లతో మంతనాలు చేస్తున్న కేసీఆర్ ..ముహూర్తం ఖరారేనా?డిప్యూటీ సీఎంగా కేటీఆర్ ..? సీనియర్లతో మంతనాలు చేస్తున్న కేసీఆర్ ..ముహూర్తం ఖరారేనా?

 కవిత కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్

కవిత కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్

సీఎం కేసీఆర్ కవిత విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కవిత పార్టీ వ్యవహారాల్లో కూడా కీలక భూమిక తీసుకోవటం లేదు. ఇక ఈ సమయంలో కవిత కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెడుతున్నారని,అందుకే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతుంది .

కవితకు రాజ్య సభ సీటు .. డైలమాలో కేసీఆర్

కవితకు రాజ్య సభ సీటు .. డైలమాలో కేసీఆర్

అయితే కవిత విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని టాక్ వినిపిస్తుంది. కవితకు రాజ్య సభ సీటు కేటాయించి కేంద్ర రాజకీయాల్లోకి పంపుతారన్న వార్తలు వస్తున్నా సీఎం కేసీఆర్ అందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతుంది. దీంతో కేసీఆర్ కుటుంబంలోనూ కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే అన్ని పదవులు సీఎం ఇంటికే పరిమితం అయ్యాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవితను రాజ్యసభకు కూడా పంపిండం మరిన్ని విమర్శలకు దారి తీస్తుందని కేసీఆర్ అంటున్నట్లు సమాచారం .

కవితకు ఏ పదవి ఇవ్వాలని కేసీఆర్ తర్జన భర్జన

కవితకు ఏ పదవి ఇవ్వాలని కేసీఆర్ తర్జన భర్జన

కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా కవిత రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న చర్చ జరిగింది. అప్పుడు కూడా భవిష్యత్ లో మంచి అవకాశం ఇస్తారని కవితకు నచ్చజెప్పినట్టు సమాచారం. ఇక ఇప్పుడు కూడా కవితకు రాజ్య సభ సభ్యురాలిగా అవకాశం ఇవ్వటంపై సీఎం కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారు. ఒకపక్క మంత్రి కేటీఆర్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారని ప్రచారం జరిగిన వేళ కవితకు కేసీఆర్ పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ స్థానం కల్పిస్తారా లేదా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కవిత పదవి విషయంలో గులాబీ శ్రేణుల్లో చర్చ

కవిత పదవి విషయంలో గులాబీ శ్రేణుల్లో చర్చ

ఇక కవిత విషయంలో కేటీఆర్ కూడా రాజ్యసభ కాకుండా మరో పదవి ఏదైనా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి బీసీకాని, దళిత వర్గానికి కాని ఇవ్వాలన్నది కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కవిత అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో సీఎం ఇంట్లో ఈ అంశంపై కోల్డ్ వార్ కొనసాగుతుందని పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది . మొత్తానికి రాజ్యసభ స్ధానం సీఎం కేసీఆర్ కవితకు కేటాయిస్తారా ? లేకా మంత్రిగా అవకాశం ఇస్తారా ? మరేదైనా పదవిని కట్టబెడతారా ? అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Cold War Running at Telangana Chief Minister KCR's Home? CM KCR is yet to finalize anything about kavitha ? CM KCR is concerned about the political future of his daughter Kavitha? There is debate that yes, the debate will continue not only in the TRS party lines but also in the house of CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X