వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పినా పట్టించుకోరా?: ఆమ్రపాలికి కోపం వచ్చింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి కోపం వచ్చిందట. తాను స్వయంగా ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

నగరంలోని ఆసుపత్రుల సమీక్షలో భాగంగా సీఎంకే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు - ప్రసూతి ఆసుపత్రి నిర్వహణపై ఆర్ఎంవో డాక్టర్, సూపరింటెండెంట్‌లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించారట.

Collector Amrapali fires at officers

మూడు వారాల క్రితం ఆసుపత్రిలో డిప్యుటేషన్ పైన ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కాన్పులకు వచ్చే వారి కోసం స్కానింగ్ మిషన్, నీటి శుద్ధి యంత్రాలు, జనరేటర్ కోసం అంచనాలు సమర్పించాలని చెప్పినా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహించారు.

నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్

ఇది తొలి తప్పుగా భావిస్తూ వారిని ప్రస్తుతానికి మందలించి వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గర్భిణీలను ఆసుపత్రికి తీసుకు వచ్చి పరీక్షలు చేసిన అనంతరం ఇంటి వద్ద తిరిగి వదిలేసేందుకు 102 సేవలు అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా ఆమ్రపాలి అన్నారు.

English summary
Warangal collector Amrapali fired at officers for neglisism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X