వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్..

కుంట శిఖం భూమిలో నిర్మాణాలు చేయించడమే కాక మరికొంతమంది ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని కలెక్టర్ దేవసేన అన్నారు.

|
Google Oneindia TeluguNews

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో బతుకమ్మ కుంట వివాదంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ దేవసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కలెక్టర్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యే అక్రమాలపై పెదవి విప్పడంతో.. జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

బతుకమ్మ కుంటకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మరీ ముత్తిరెడ్డి ఐదెకరాల మేర కుంటను పూడ్చారని కలెక్టర్ దేవసేన ఆరోపిస్తున్నారు. అసలే మంచినీటికి కటకట ఉన్న జనగామలో ఇలాంటి చిన్న చిన్న కుంటలను కూడా బతకనివ్వకపోతే.. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె చెబుతున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చుక్కలు: తడాఖా చూపిన కలెక్టర్ దేవసేన..టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చుక్కలు: తడాఖా చూపిన కలెక్టర్ దేవసేన..

అంతేకాదు, కుంట మరమ్మత్తులకు సంబంధించి స్థానిక వ్యాపారుల నుంచి రూ.30లక్షలు వసూలు చేసిన ముత్తిరెడ్డి.. దానికి సంబంధించిన ఖర్చులను మాత్రం చూపించడం లేదన్నారు.

బతుకమ్మ కుంట:

బతుకమ్మ కుంట:

జనగామ పట్టణ కేంద్రం బస్టాండ్‌కు కూతవేటు దూరంలో సర్వేనెంబర్- 85లో 9.16 ఎకరాలలో ధర్మోని (బతుకమ్మ) కుంట విస్తీర్ణం ఉండేది. పట్టణం విస్తరించడంతో కొంతమంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కుంట సమీపంలోని ప్లాట్లను విక్రయించడమే కాక కుంట శిఖం భూములను సైతం ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు.

శిఖం భూముల్లో కుంట:

శిఖం భూముల్లో కుంట:

2013లో కుంట శిఖం భూముల్లోనే కొంతమంది దుర్గామాత దేవాలయాన్ని నిర్మించారు. నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన ఈ నిర్మాణంపై అప్పటి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న అప్పటి స్థానిక ఆర్‌డివో హరితను మందలించారు. శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అదే కుంటను ఆనుకుని శిఖం భూమిలో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమిలో ఆలయాన్ని నిర్మించారు.

అక్రమంగా ముత్తిరెడ్డి:

అక్రమంగా ముత్తిరెడ్డి:

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుంటను మరమ్మత్తు పేరుతో పూడ్చివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మత్తడి పూర్తిగా ధ్వంసం అయింది.ఎఫ్‌టిఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)పరిధిలో గల ఐదెకరాల శిఖం భూమిలో మట్టితో పూడ్చారు. కుంట కట్టను మరమతు చేయించి చెరువు చెట్టు ప్రహరీ సైతం నిర్మించారు. ఇందుకోసం పట్టణంలోని వివిధ కుల సంఘాల, వ్యాపారస్తుల ద్వారా వసూళ్లు చేసిన రూ. 30 లక్షలు వసూలు చేసినట్లు ఎమ్మెల్యే అనేక సందర్భాల్లో స్వయంగా చెప్పారు.

నిధుల కోసం అప్పీల్:

నిధుల కోసం అప్పీల్:

స్థానికంగా వసూలు చేసిన నిధులతో మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో.. ప్రభుత్వం నుంచి నిధులు కావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రభుత్వానికి ఒక ఎస్టిమేషన్ పంపించాలనుకున్నారు. ఇందుకోసం అప్పటి కలెక్టర్ ప్రద్యున్నను సంప్రదించి వినతిపత్రం అందజేశారు. అయితే ప్రద్యున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గా వచ్చిన జీవన్ ప్రశాంత్ పాటిల్ దాన్ని తిరస్కరించారు. నిబంధనలకు విరుద్దమంటూ ఆయన తేల్చి చెప్పడంతో.. ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే పేరు మీద కుంట భూమి:

ఎమ్మెల్యే పేరు మీద కుంట భూమి:

తర్వాతి కాలంలో మిషన్ కాకతీయ ద్వారా రూ. కోటి 10 లక్షల నిధులు తెప్పించి మరమ్మత్తుకు వినియోగించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే 2016 అక్టోబర్ 22న దేవాలయం ట్రస్టు రూపంలో కుంట శిఖంలోని 2000 గజాల భూమి ఎమ్మెల్యే పేరుపై రిజిస్ట్రేషన్ అయింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

విచారణ చేపట్టాలంటున్న కలెక్టర్:

విచారణ చేపట్టాలంటున్న కలెక్టర్:

ఇటీవల బతుకమ్మ కుంట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జనగామ కలెక్టర్ శ్రీదేవసేనను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. కుంట మరమ్మత్తు పనులు పూర్తి కానందువల్ల రూ.2.20కోట్ల నిధులు మంజూరు చేయించాలని కోరారు. అయితే కుంటను పూడ్చడమే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దమని, దానిపై విచారణ చేపట్టాల్సిన అవసరముందని వారికి స్పష్టం చేశారు.

బతుకమ్మ వేడుకలు మరో చోట:

బతుకమ్మ వేడుకలు మరో చోట:

బతుకమ్మ, దసరా ఉత్సవాలను బతుకమ్మ కుంటలో నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను కోరగా.. అందుకు ఆమె అంగీకరించలేదు. వివాదాస్పద భూమిలో ఎటువంటి వేడుకలు నిర్వహించేది లేదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే తమ ఆవేశాన్ని దిగమింగుకొని కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

సోమవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి జనగామకు వచ్చిన సందర్భంగా ముత్తిరెడ్డి ఆయనను బతుకమ్మ కుంటకు తీసుకొని వెళ్లి సమస్యను వివరించారు. వారి వెంట వెళ్లిన కలెక్టర్ శ్రీదేవసేన గతంలో జరిగిన విషయాన్ని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ విషయాలు తెలుసుకుందామని వెళ్లిపోయారు.
కోరగా అందుకు కలెక్టర్ అంగీకరించలేదు.

అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు, వాకర్స్ తో మాట్లాడారు. కుంట శిఖం భూముల్లో మరమ్మత్తులు చేసేందుకు అదేశాలు ఇచ్చే అధికారం తమ పరిధిలో లేదని అన్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శిఖం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయగా.. తానే స్వయంగా ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయించానని, సరిహద్దులు కూడా పేర్కొనకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె పేర్కొన్నారు.

రాద్దాంతం వద్దు:

రాద్దాంతం వద్దు:

కుంట శిఖం భూమిలో నిర్మాణాలు చేయించడమే కాక మరికొంతమంది ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా చేపట్టే ఏ పనికైనా సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్పటివరకు జరిగిన పనులపై విచారణ జరిపించి ఎన్ని నిధులు కావాలో ఉన్నతాధికారులతో చర్చించి కృషి చేస్తానని అన్నారు. అంతే తప్ప అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనవసరం రాద్దాంతం చేయవద్దని దేవసేన సూచించారు.

English summary
The Jangaon district collector Devasena who had been patiently tolerating the tantrums of TRS MLA Muthireddy Yadagiri Reddy has exposed the corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X