వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కాకపోతే : విద్యార్థులకు నారాయణ సంస్థల బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: కరోనావైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే అన్ని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ వారికి క్లాసెస్ గోల మాత్రం వీడలేదు. ప్రభుత్వ కాలేజీలు కఠినంగా లాక్‌డౌన్‌ను ఇంప్లిమెంట్ చేస్తుండగా ప్రైవేట్ కాలేజీలు మాత్రం వాటిని అమలు చేయడం లేదు. దొరికిందే ఛాన్స్ కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు తప్పకుండా హాజరు కావాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే దీనివల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

డిజిటల్ క్లాసులకు అటెండ్ కాకపోతే...

డిజిటల్ క్లాసులకు అటెండ్ కాకపోతే...

లాక్‌డౌన్ అమలులో ఉండటంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రైవేట్ కాలేజీలు మాత్రం విద్యార్థులను వీడటం లేదు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులంతా ఆన్‌లైన్ క్లాసులకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలిచ్చాయి. అయితే విద్యార్థులకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే అందరికీ ఇళ్లల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు. అలాంటి వారు ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్లాసులకు హాజరు కాకపోతే అటెండెన్స్ షార్టేజీ వస్తుందని యాజమాన్యం చెబుతున్నట్లు నారాయణ ఐఐటీ ఒలింపియాడ్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వెల్లడించాడు. వాట్సాప్ ద్వారా విద్యార్థి ఫోనుకు మెసేజ్ పంపడం జరిగింది. అటెండెన్స్ లేకపోతే 10వ తరగతికి ప్రమోట్ కావడం కష్టమని యాజమాన్యం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు రోజూవారీ అసైన్‌మెంట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడం జరిగింది.

ఇంటర్నెట్ సదుపాయం లేని వారి పరిస్థితి ఏంటి..?

ఇంటర్నెట్ సదుపాయం లేని వారి పరిస్థితి ఏంటి..?


ఇక ఇళ్లల్లో ఇంటర్నెట్ ఇతర సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది నారాయణ ఐఐటీ ఒలింపియాడ్ యాజమాన్యం ఆలోచించలేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాదు లాక్‌డౌన్ కంటే ముందు తమ బిడ్డలు ఇతర ఊళ్లకు వెళ్లారని ఇప్పుడు లాక్‌డౌన్ ఉండటంతో వారు అక్కడే చిక్కుకుపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే స్కూలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోందని.. ఊళ్లల్లో మొబైల్ డేటా తప్ప ఇంటర్నెట్ సౌకర్యం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ డేటా అంతగా సహకరించదని చెబుతున్నారు.

స్కైప్ ద్వారా క్లాసెస్ నిర్వహిస్తున్న ఇఫ్లూ

స్కైప్ ద్వారా క్లాసెస్ నిర్వహిస్తున్న ఇఫ్లూ

ఇదిలా ఉంటే హైదరాబాదులోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ కూడా విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఇది ఎంఏ బీఈడీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అయితే చాలామంది ఈ ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకున్నారు. దీనికి ప్రధాన కారణం సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడమే అని విద్యార్థులు వాపోతున్నారు. స్కైప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసెస్‌కు చాలామంది విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు. వారి మొబైల్‌లో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే ఉంటుందని, రెండు క్లాసులకు హాజరైతే ఆ డేటా మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే ఇలా రోజూ 1.5 జీబీ డేటా ప్యాక్ అదనంగా వేయించుకోలేమని బీఈడీ కోర్సు చేసే ఓ విద్యార్థి చెప్పాడు.

నష్టపోతున్నామంటున్న విద్యార్థులు

నష్టపోతున్నామంటున్న విద్యార్థులు

ఇక ఇంటర్నెట్ సౌకర్యం ఉందా లేదా అనేది చూడకుండా యూనివర్శిటీ ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని డిసైడ్ అయ్యిందని దీనివల్ల తాము నష్టపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఒకవేళ మొబైల్ డేటా అయిపోయి ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాకపోతే తమన ఆబ్సెంట్ కిందకు లెక్కగడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ లేని వారే దీనివల్ల అధికంగా నష్టపోతున్నారని సమాచారం. ఇలాంటి సమస్యల గురించి యూనివర్శిటీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు మరో విద్యార్థి. కొన్నిసార్లు టీచర్ ఏమి చెబుతుందో స్కైప్‌లో ఆడియో స్పష్టంగా ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. చాలా శ్రద్ధగా వినాలని ఆసక్తి చూపినప్పటికీ టీచర్ ఆడియో స్పష్టంగా ఉండకపోవడంతో సమయం, డేటాతో పాటు ఎనర్జీ కూడా వృథా అవుతోందని విద్యార్థులు చెబుతున్నారు.

English summary
The digital divide exists, and the COVID-19 lockdown has taught this to students. Even as students who study in premier educational institutions have been asked to attend classes online, not many have had the privilege the attend these sessions regularly. The problems are many.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X