హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: వేణుమాధవ్ సినిమాల్లోనే కాదు, నామినేషన్ వేసేందుకు వెళ్తే కూడా కామెడీ అయింది

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : నామినేషన్ వేసేందుకు వెళ్ళిన వేణుమాధవ్..! | Oneindia Telugu

కోదాడ: నల్గొండ జిల్లా (పాత జిల్లా) కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శుక్రవారం నాడు ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.

<strong>నాకు మంత్రి పదవే ఎక్కువ: 'సీఎం'పై కేటీఆర్, తెరాస అధికారంలోకి రాకుంటే సంచలన నిర్ణయమే!</strong>నాకు మంత్రి పదవే ఎక్కువ: 'సీఎం'పై కేటీఆర్, తెరాస అధికారంలోకి రాకుంటే సంచలన నిర్ణయమే!

ఈ మేరకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. వేణుమాధవ్ అధికారులకు నామినేషన్ పత్రాలు ఇచ్చారు. అయితే ఆ పత్రాలను చూసిన రిటర్నింగ్ అధికారులు సరిగా లేవని చెప్పి, తిరస్కరించారు. దీంతో వేణుమాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన వేణుమాధవ్

నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన వేణుమాధవ్

వేణుమాధవ్ ఎన్నో సినిమాల్లో కామెడి వేషాలు వేసి, తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్వించారు. సినిమాల్లో నవ్వించిన అతను ఇప్పుడు నిజ జీవితంలోను నామినేషన్ వేయడానికి వెళ్లి, నామినేషన్ వేయకుండానే వెనుదిరగడం కూడా కామెడీని తలపించింది.

అన్ని పత్రాలతో మళ్లీ నామినేషన్ వేస్తా

అన్ని పత్రాలతో మళ్లీ నామినేషన్ వేస్తా

తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై వేణుమాధవ్ స్పందించారు. తాను నామినేషన్‌కు అవసరమైన పత్రాలను పూర్తిస్థాయిలో సేకరించిన తర్వాత శనివారం లేదా ఆదివారం మళ్లీ వేస్తానని స్పష్టం చేశారు. ఇతని స్వస్థలం కోదాడ. కాబట్టి ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు వేణుమాధవ్ ఉత్సాహంగా ఉన్నారు. కోదాడ నుంచి కూటమి తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, తెరాస తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.

టీడీపీతో వేణు మాధవ్‌కు మంచి అనుబంధం

టీడీపీతో వేణు మాధవ్‌కు మంచి అనుబంధం

వేణుమాధవ్ కోదాడ పట్టణంలో పుట్టారు. చదువుకుంటున్న రోజుల్లో మిమిక్రీ పట్ల ఆకర్షితుడయ్యారు. మిమిక్రీ కళాకారుడిగా ఎదిగారు. అతని మిమిక్రీ ప్రదర్శనలకు మంచి పేరు వచ్చింది. అయితే అతని కల తెలుగుదేశం పార్టీ దృష్టిలో పడింది. దీంతో అతని కెరీర్ మరో మలుపు తిరిగింది. టీడీపీ సభలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎన్టీఆర్‌తో, ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబుతో వేణుమాధవ్‌కు మంచి అనుబంధం ఉంది.

నటుడు వేణుమాధవ్

నటుడు వేణుమాధవ్

ఆ తర్వాత వేణుమాధవ్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీంతో బిజీగా మారిపోయారు. ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో, మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ తనకు జీవితాన్ని ఇచ్చిందని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా. వేణుమాధవ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.

English summary
Comedian Venu Madhav to file nomination as an independent candidate for Kodad assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X