వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: మెట్రోలో కామన్ టికెట్.. ఆర్టీసీ బస్సుతోను లింక్!

కామన్ టికెట్ అంశం గురించి మెట్రో బోర్డు అధికారులు చర్చించినట్లుగా సమాచారం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

మెట్రో టికెట్ తోనే ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్ లోను ప్రయాణంcommon pass For Metro Rail and RTC| Oneindia

హైదరాబాద్: నవంబర్ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టడం ఖాయమైపోవడంతో మెట్రో మెట్రో రైలు భవన్‌లో బోర్డు సమావేశం జరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) బోర్డు చైర్మన్‌ ఎస్పీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కామన్ టికెట్ అంశం గురించి మెట్రో బోర్డు అధికారులు చర్చించినట్లుగా సమాచారం. ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్ ను అనుసంధానం చేసేలా మెట్రో టికెట్ రూపొందించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కామన్ టికెట్:

కామన్ టికెట్:

ఉదాహరణకు మెట్రో రైలు ద్వారా నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చేవాళ్లు అక్కడినుంచి మరో చోటుకు బస్సు ద్వారా వెళ్లాలనుకుంటే.. ఆర్టీసీలోను ప్రత్యేకంగా టికెట్ తీసుకునే అవసరం లేకుండా చేయనున్నారు. మెట్రో టికెట్ తోనే ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్ లోను ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నారు.

ట్రయల్ రన్స్:

ట్రయల్ రన్స్:

ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పవర్‌ పాయుంట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మియాపూర్‌-అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేప్టీ నుంచి అవసరమైన అనుమతులను నవంబర్‌ మొదటి వారం కల్లా తీసుకుంటామన్నారు. అక్టోబర్‌ 15 నుంచి సీఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు మెట్రో ట్రయల్‌ రన్స్‌ను పరిశీలిస్తారన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో:

అంతర్జాతీయ ప్రమాణాలతో:

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెట్రో కారిడార్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నమూనా చిత్రాల ద్వారా ప్రాజెక్టు స్వరూపాన్ని చూపించారు. ఇక సీఎస్ మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు ప్రారంభ తేదీ ఖరారైనందున పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

మెరుగైన సౌకర్యాలు:

మెరుగైన సౌకర్యాలు:

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా మూత్రశాలలు, బస్‌బేలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (ఫైనాన్స్‌) కె.రామకృష్ణరావు, సెక్రటరీ (ఫైనాన్స్‌) ఎస్‌.శివశంకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌ రెడ్డి, వాటర్‌ బోర్డు మండలి ఎం.దాన కిశోర్‌ పాల్గొన్నారు.

English summary
Hyderabad Metro Rail limited board conducted a meeting with officials on Tuesday. They discussed on Common ticket which is also useful in RTC also
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X