హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు పెళ్లాల పోలీసు: నాలుగో మహిళ కోసం.. మూడో భార్య ఫిర్యాదు, అలా వలలో వేసుకున్నాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసిఫాబాద్ సీఐ రాజయ్య పైన ఆయన భార్య రేణుక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు ఇచ్చారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు. తమ ముగ్గురు పిల్లలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

2009 మే 10వ తేదీన రాజయ్య తనను పెళ్లి చేసుకున్నాడని, తమకు ముగ్గురు పిల్లలు కలిగారని, ఇప్పుడు తనను నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేశాడని ఆరోపించారు. తనకు ఎవరూ లేరని, తన భర్త రాజయ్యతోనే ఉంటానని, తనకు, తన పిల్లలకు న్యాయం కావాలని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

సీఐ పైన మూడో భార్య ఫిర్యాదు

సీఐ పైన మూడో భార్య ఫిర్యాదు

బాధితురాలు రేణక ఎస్సై రాజయ్యకు మూడో భార్య. ఆమె ఫిర్యాదుతో అతనికి ముగ్గురు భార్యలు ఉన్న విషయం వెలుగు చూసింది. నల్గొండ జిల్లా (పాత జిల్లా) సూర్యాపేట సమీపంలోని మునగాల మండలం నారాయణగూడ గ్రామానికి చెందిన రాజయ్య 2009లో తాండూరు సమీపంలోని కరణ్ కోర్టు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేశాడు.

ఇష్టపడి ఒకరితో శృంగారం, రెండో వ్యక్తి రేప్ ప్రయత్నం: నగ్నంగా మూడో అంతస్తు నుంచి దూకిన యువతిఇష్టపడి ఒకరితో శృంగారం, రెండో వ్యక్తి రేప్ ప్రయత్నం: నగ్నంగా మూడో అంతస్తు నుంచి దూకిన యువతి

 అప్పుడు రేణుకను వలలో వేసుకున్నాడు

అప్పుడు రేణుకను వలలో వేసుకున్నాడు

ఓ వివాదం విషయమై తనను ఆశ్రయించిన రేణుకను వలలో వేసుకున్నాడు. అదే ఏడాది మే 10వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంతకుముందే అతనికి రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయి. అయితే తన ఇద్దరు భార్యలు చనిపోయినట్లు తనను నమ్మించాడని రేణుక ఆరోపిస్తున్నారు. ఇటీవలివరకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పని చేశాడు. గత నెల 24వ తేదీన బదలీ అయ్యాడు.

నాలుగో మహిళతో పెళ్లి కోసం తనకు మోసం

నాలుగో మహిళతో పెళ్లి కోసం తనకు మోసం


ఇన్నాళ్లు తన భర్త తనను బాగానే చూసుకున్నాడని, మరో మహిళను (నాలుగో మహిళ) పెళ్లి చేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రేణుక సోమవారం ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించారు. తనను మన్సూరాబాదులోని ఓ అద్దె ఇంట్లో ఉంచి, సదరు మహిళను హయత్ నగర్ సమీపంలోని మునగరనూరులో సొంత ఇంట్లో ఉంచాడని ఆరోపించారు.

ఇంటికి రాకపోవడంపై నిలదీస్తే

ఇంటికి రాకపోవడంపై నిలదీస్తే

గత నెల 2వ తేదీ నుంచి తన భర్త రాజయ్య ఇంటికి కూడా రావడం లేదని ఆమె చెప్పారు. ఇంటికి రావడం లేదేమిటని నిలదీస్తే సొంతగా బతకాలని తనకు సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సీఐ రాజయ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె రాచకొండ సీపీ మహేష్ భాగవత్‌ను కూడా కలిశారు.

English summary
Complaint registered against Asifabad CI Rajaiah for extra marital affair. Wife complained in LB Nagar police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X