హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు: ఆఫీస్‌కు లేట్, జీఎంకు ఫిర్యాదుల వెల్లువ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంఎంటీఎస్‌ సమస్యలను పరిష్కరిస్తామని రైల్వే జీఎం రవీంద్రగుప్తా అన్నారు. దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రవీంద్రగుప్తా జంటనగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణ తీరుతెన్నులు తెలుసుకునేందుకు సోమవారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్‌ రైలులో పర్యటించారు.

రైల్వేస్టేషన్లు, బోగీల్లో ప్రయాణికులతో కలిసి ప్రయాణించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైలులోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, మహిళలు తదితర ప్రయాణికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సర్వీసులు, టికెట్‌ కౌంటర్లను పెంచాలని ప్రయాణికులు జీఎం రవీంద్రగుప్తాతో తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు ముఖ్యంగా హైటెక్‌ సిటీకి రాకపోకలు సాగించే సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాంతో ఆఫీసుకు లేటవుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్‌, లింగంపల్లి తదితర స్టేషన్లలో ఏ సర్వీసు ఏ ప్లాట్‌ఫారంపైకి వస్తుందో చివరి వరకు తెలియడం లేదని మరికొందరు చెప్పారు. ఫస్ట్‌క్లాస్‌, జనరల్‌ బోగీలు ఒకేలా ఉండడంతో గందరగోళం కలుగుతోందని, ముంబాయ్‌ తదితర మహానగరాల్లో మాదిరి బోగీలకు రంగులు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఓ ప్రయాణికుడు సూచించారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు


ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైలెట్స్‌ తదితర మొబైల్‌ యాప్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్న విషయాన్ని జనరల్‌ మేనేజర్‌ ప్రస్తావించగా, సదరు యాప్స్‌ ఉన్నట్టు తెలియదని కొందరు చెప్పారు. దీంతో రవీంద్ర గుప్తా ఓ ప్రయాణికురాలి ఫోన్‌ తీసుకుని యాప్‌డౌన్‌లోడ్‌ పద్ధతి వివరించారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎంఎంటీఎస్‌ రెండో దశపై త్వరలో ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులతో చర్చించనున్నట్టు దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్రగుప్తా చెప్పారు. లింగంపల్లి స్టేషన్‌లో రవీంద్రగుప్తా మాట్లాడుతూ త్వరలో సర్వీసులు, కౌంటర్లను పెంచేలా చూస్తానని తెలిపారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు


ఎంఎంటీఎస్‌ ఫేజ్‌ -2 పనుల్లో జాప్యం ఉన్నందున సమస్యలు ఏర్పడుతున్నాయని, ఎంఎంటీఎస్‌ విస్తరణకు భూ సేకరణలో అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎంఎంటీఎస్‌ రైళ్లనిర్వహణ గురించి తెలుసుకునేందుకు తన పర్యటన విజయవంతమైందని, ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తూనే కొన్ని సూచనలు చేశారన్నారు. బోగీల్లో సిట్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచాలని కొందరు సూచించారని, అయితే... ప్రపంచంలో ఎక్కడచూసినా సిట్టింగ్‌ సామర్థ్యం ఎక్కువ ఉండదన్నారు.
ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు చురుగ్గానే సాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖ స్థలాలు అవసరంకావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నామని చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రైల్‌ కనెక్టివిటీ విషయం ఇంకా కొలిక్కి రాలేదని, జీఎంఆర్‌ కంపెనీ తగిన స్థలం కేటాయిస్తే వేగవంతం అవుతుందని వివరించారు.
 ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు


ఎంఎంటీఎస్‌ రెండో దశను వికారాబాద్‌ వరకు పొడిగించే అంశం తమ పరిశీలనలో లేదని, ప్రజల నుంచి డిమాండ్‌ వస్తే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని జనరల్‌ మేనేజర్‌ రవీంద్రగుప్తా వెల్లడించారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను, ఫుట్‌ఓవర్‌ వంతెన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించానని చెప్పారు.

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆలస్యంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు


హైటెక్‌ సిటీ పరిసరాలకు కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మకాం మార్చడం, నిర్మాణాలు పూర్తి కావడంతో కార్మికుల రాకపోకలు నిలిచిపోవడం తదితర కారణాల వల్లనే ఆక్యుపెన్సీ శాతం తగ్గిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆశిష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

English summary
On his first-ever ride on a Multi-Modal Transit System train here on Monday, South Central Railway General Manager Ravindra Gupta was greeted with complaints from passengers. They ranged from running schedules going awry to trains not arriving on time, during peak hours, demands for more number of seats and lack of cleanliness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X