వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా టెక్కీ క్రెడిట్ కార్డుతో కారు, బంగారం కొనుగోలు, బ్యాంకు ఫిర్యాదుతో చివరికిలా..

అమెరికా టెక్కీకి చెందిన క్రెడిట్ కార్డు నుండి రూ.9.04 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు హైద్రాబాద్ కు చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:అమెరికాకు చెందిన టెక్కీకి చెందిన క్రెడిట్ కార్డు నుండి రూ.9.04 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు హైద్రాబాద్ కు చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తి.అయితే బ్యాంక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నాగేశ్వర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రాణిగంజ్ కు చెందిన బ్రాంచ్ అధికారులు నాగేశ్వర్ రావుపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే అమెరికాకు చెందిన చేస్ బ్యాంకు కూడ ఇదే అంశంపై మార్చి 6వ, తేదిన కూడ ఫిర్యాదు చేసింది.

Con king makes killing with US techie's card

చేస్ బ్యాంక్ క్రెడిట్ ద్వారా హైద్రాబాద్ కొండాపూర్ లోని రెనాల్ట్ షోరూమ్ లో రూ.7.65 లక్షలతో కారును కొనుగోలు చేశారు. పంజగుట్టలోని జోయాలూకాస్ షోరూమ్ లో కూడ రూ.1.39 లక్షల విలువైన ఆభరణాలను కొనుగోలు చేశారు.

అయితే పెద్ద మొత్తంలో తమ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేస్తున్నాడని చేస్ బ్యాంక్ హైద్రాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుల ఆధారంగా నాగేశ్వర్ రావును గురువారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ క్రెడిట్ కార్డు తనకు ఆనంద్ భాస్కర్ అనే తన స్నేహితుడు ఇచ్చాడని నాగేశ్వర్ రావు చెప్పాడు.

అయితే ఈ క్రెడిట్ కార్డు భాస్కర్ రావు ది కూడ కాదు. ఆయనకు ఎస్.చక్రపాణి అనే అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చాడని చెప్పారు.ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేస్తే 50 శాతం ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఆయన నమ్మించాడని భాస్కర్ చెప్పాడని సైబర్ క్రైమ్ ఇన్స్ పెక్టర్ విపి తివారీ చెప్పారు.

అయితే ఈ క్రెడిట్ కార్డు ద్వారా రెనాల్ట్ షోరూమ్ లో కొనుగోలు చేసిన కారును నాగేశ్వర్ రావు తన వద్ద ఉంచుకొన్నాడు.అయితే ఆనంద్ భాస్కర్ జోయలూకాస్ షోరూమ్ లో కొనుగోలు చేసిన బంగారాన్ని తనవద్ద ఉంచుకొన్నాడు.

అయితే నాగేశ్వర్ రావు ఇటీవలే బోరబండ వద్ద అరుణ టెక్ మార్ట్ అనే సంస్థను ప్రారంభించాడు.అయితే ఇక్కడ కూడ క్రెడిట్, డెబిట్ కార్డులను దుర్వినియోగం చేశారని పోలీసుల విచారణలో తేలింది.అయితే దీనిపై కూడ మరో కేసును నమోదు చేయనున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.అయితే క్రెడిట్ కార్డు యూఎస్ కు చెందిన టెక్కీకి చెందిన క్రెడిట్ కార్డుగా పోలీసులు చెప్పారు.

English summary
Cyber Crime police arrested a person for using a stolen international credit card belonging to a US-based techie, for buying goodies worth Rs 9.04 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X