ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విహెచ్‌కు పవన్ కౌంటర్: సీఎం అభ్యర్తైతే నీతో తెలంగాణలో పర్యటిస్తా, కాళ్ళు మొక్కి..

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Telangana Tour : పవన్ కల్యాణ్‌ ను ఏకేసిన విహెచ్

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వి. హనుమంతరావును తెలంగాణ రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలో వి. హనుమంతరావుతో కలిసి పర్యటించేందుకు తాను సిద్దమేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో తనతో కలిసి పర్యటిస్తే సమస్యలేమిటో చూపుతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన కామెంట్స్‌పై పవన్ కళ్యాణ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలంటే తనకు అమితమైన గౌరవం ఉందన్నారు. తనది లెప్ట్ కాదని, రైట్ కాదని, ప్రజల పక్షమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అప్పుడు భజన పార్టీ కాదా, పవన్‌ను చూస్తే భయం: డైరెక్టర్ తమ్మారెడ్డి సంచలనంఅప్పుడు భజన పార్టీ కాదా, పవన్‌ను చూస్తే భయం: డైరెక్టర్ తమ్మారెడ్డి సంచలనం

ఖమ్మంలోని ఎంబీ గార్డెన్‌లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడ పవన్ కళ్యాణ్ బావోద్వేగ ప్రసంగం చేశారు.

బుదవారం నాడు ఖమ్మం పట్టణంలో పవన్ కళ్యాణ్ సుమారు అరగంటకు పైగా మూడు జిల్లాల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. మానవత్వంతో కూడిన రాజకీయాలు చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

వి. హనుమంతరావుకు పవన్ కళ్యాణ్ కౌంటర్

వి. హనుమంతరావుకు పవన్ కళ్యాణ్ కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు. తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉందనే విషయాన్ని గుర్తించేందుకు తనతో కలిసి పర్యటించాలని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చేసిన కామెంట్స్‌పై పవన్ ధీటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా వి. హనుమంతరావును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే తెలంగాణలో వి. హనుమంతరావుతో కలిసి పర్యటించి ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొంటానని పవన్ చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు ఏ రకంగా ఏకమయ్యాయో, తెలంగాణ అభివృద్ది కోసం కూడ ఏకం కావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలంటే తనకు అమితమైన గౌరవం ఉందన్నారు

లెఫ్ట్ కాదు, రైట్ కాదు, ప్రజల పక్షం

లెఫ్ట్ కాదు, రైట్ కాదు, ప్రజల పక్షం

తాను లెప్ట్ కాదు, రైట్ కాదన్నారు. తాను ప్రజల పక్షమని చెప్పారు. తాను వ్యవహరించే పద్దతుల్లో కొన్ని సమయాల్లో తాను కొంరదికి లెఫ్టిస్టుగా కన్పిస్తానని, మరికొన్ని సమయాల్లో రైటిస్టుగా కన్పిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, తాను ప్రజల పక్షమని చెప్పారు.

నాపై దాడులు చేసినా భరిస్తా

నాపై దాడులు చేసినా భరిస్తా

తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.రాజకీయ వ్యవస్థలో మార్పు కోసమే జననసేను ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. మానవత్వంతో కూడిన రాజకీయాలను చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై తనపై దాడులు చేసినా, విమర్శలు గుప్పించినా కానీ, తాను తట్టుకొని నిలబడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

నల్గొండ ఘటనే రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది

నల్గొండ ఘటనే రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది

తమ్మడు సినిమా పూర్తయ్యాక నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించినట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. బాధితులను ఆదుకొనే ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు తన ప్రయత్నాలను అడ్డుకొన్నాయని పవన్ చెప్పారు. ఈ ఘటనే తనకు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

యూత్ కావాలి

యూత్ కావాలి


రాజకీయాల్లో తాను కోరుకొంటున్న మార్పులకు సలసల రక్తం మరుగుతున్న యువత కావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు యువత వెంట అండగా నిలవాలని ఆయన కోరుకొన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ కోరారు.. ప్రత్యక్ష రాజకీయాల్లో కులాలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కులంలో ఏ రకమ��న సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయమై కుల సంఘాల నేతలతో లోతుగా చర్చిస్తున్నట్టు పవన్ చెప్పారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు

ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు

తనవి ఓటు బ్యాంకు రాజకీయాలు కావని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యను పరిష్కరించేందుకే తాను ప్రయత్నాలు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్ని కులాలకు న్యాయం చేయాలి. సామాజిక న్యాయం రావాల్సిన అవస��ం ఉందని పవన్ చెప్పారు.తనకు ఎవరిపైనే కోపం లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపైనే తన దృష్టి ఉందన్నారు.

కాళ్ళు మొక్కి

కాళ్ళు మొక్కి

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు స్టేజీపైకి వచ్చింది. ఆ సమయంలో పవన్ కళ్యాన్ ఓ వైపు మాట్లాడుతూనే మరో వైపుకు పోలీసులకు సైగ చేసి ఆ మహిళను స్టేజీ పైకి పంపాలని సూచించాడు. ఆమె స్టేజీపైనే పవన్‌ను ఆప్య��యంగా పట్టుకొంది. ఆమెను పట్టుకొని పవన్ ప్రసంగించారు. పవన్ ను ఆమె ఆశీర్వదించింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆమె కాళ్లు మొక్కాడు. మరో వైపు ఓ వికలాంగుడు కూడ స్టేజీపైకి వచ్చాడు. పవన్ వద్దకు చేరాడు. అదే సమయంలో పవన్ తన ప్రసంగాన్ని ముగించాడు.

English summary
Congress Party High Command If Hanumantha was declared as a Chief minister candidate for Telangana state, Janasena Chief Pawan Kalyan made it clear that he is ready to travel with Hanumantha Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X