వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మవిశ్వాసమే ఆడపిల్లల ఆయుధం.!మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఘట్ కేసర్ లోని మహిళా సోషల్ వెల్ఫేర్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మహిళలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందన్నారు.

ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్న ఎమ్మెల్సీ కవిత, విద్య ద్వారానే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. బాలికల చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్, గురుకులాలతో పాటు, విదేశీ విద్య కు సైతం తోడ్పాటునందిస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Confidence is a girls weapon!mlc kavitha at the Womens Day celebrations.!

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకు వి-హబ్ లాంటివి ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారని, మహిళల మీద అఘాయిత్యాలు అరికట్టడానికి షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, బద్వేల్, మహేంద్ర హిల్స్ లో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, నాటకాలు ద్వారా మహిళల గొప్పతనాన్ని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, సీఎం చంద్రశేఖర్ రావు మహిళా విద్య కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు‌ మరో మంత్రి మంత్రి మల్లారెడ్డి.

English summary
mlc kavitha calls for girls to move forward with confidence as a weapon. Participating in the Women's Day celebrations at the Women's Social Welfare College in Ghatkesar, mlc Kavitha said that the country would be better off if women were better off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X