వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజుర్‌నగర్‌లో కేటిఆర్,ఉత్తమ్‌ల మధ్య అంతర్గత ఒప్పందం : లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో పని చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌లు కలిసి పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బయటకు మాత్రం విమర్శలు చేసుకుంటూ అంతర్గతంగా కలిసి పోటి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, అది టీఆర్ఎ‌కు వేసినట్టేనని ఆయన అన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో అనేక మంది రైతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా... ప్రభుత్వ విధానంలో మార్పు రావడం లేదని విమర్శించారు. ఇక హుజుర్‌నగర్ ‌ఎన్నికల్లో కూడ సర్పంచ్‌లు ఎన్నికల్లో పోటి చేయకుండా ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే సర్పంచ్ భూమయ్యను ఆరెస్ట్ చేశారని అన్నారు.

congress and TRS are working with mutual understand in Huzurnager: dr.Laxman

మరోవైపు ప్రభుత్వ విధానలపైకూడ ఆయన మండిపడ్డారు. సీఎం కేసిఆర్ స్కాంల సర్కారుగా అభివర్ణించారు. ప్రభుత్వం అక్రమ సంపాదన ద్వార రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు. తాము సర్కార్ అవినీతి గురించి ప్రశ్నిస్తే కనీసం వాటిపై స్పందించకుండా బీజేపీపై ఎదురదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

English summary
congress and TRS are working with mutual understand in Huzurnager by-elections, Telangana BJP president dr.Laxman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X