వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ హత్య: 'కేసీఆర్‌ను అంటారా, కోమటిరెడ్డి పాములా పెంచారు, కాల్ లిస్ట్ ఇవ్వు'

|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్‌ది రాజకీయ హత్యేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని మండిపడుతున్నారు. అతనికి రక్షణ కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. శనివారం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు డీజీపీని కలిశారు.

Recommended Video

శ్రీనివాస్ హత్య సూత్రధారి TRS ఎమ్మెల్యే !

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. శ్రీనివాస్‌ హత్య కేసీఆర్ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, లింగయ్యకు భద్రత కల్పించాలన్నారు. తనకేమైనా జరిగితే టీఆర్ఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

హత్యతో మాకేం సంబంధం

హత్యతో మాకేం సంబంధం

మరోవైపు, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.శ్రీనివాస్‌ను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులూ ఆ పార్టీ నేతలేనని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తెరాసకు ఆపాదించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు.

 నిందితులు అందరూ కోమటిరెడ్డితో ఫోటోలు

నిందితులు అందరూ కోమటిరెడ్డితో ఫోటోలు

శ్రీనివాస్‌ హత్యతో తెరాసకు ఎలాంటి సంబంధం లేదని కర్నె స్పష్టం చేశారు. పలు ఫోటోలను ఆధారంగా చూపుతూ తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని, వాటినే ప్రామాణికంగా భావిస్తే నిందితులంతా కోమటిరెడ్డితో ఫొటోలు దిగారన్నారు. ఎమ్మెల్యే వీరేశం పీజీ పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో ఒక కాలేజీలో ఆయనతో కొందరు ఫోటోలు తీయించుకున్నారని, శ్రీనివాస్‌ హత్య నిందితులు కూడా ఫోటోలు దిగిన వారిలో ఉన్నారన్నారు.

 నిందితుడిని కోమటిరెడ్డి పాములా పెంచారు

నిందితుడిని కోమటిరెడ్డి పాములా పెంచారు

శ్రీనివాస్‌ హత్యకేసులో నిందితుడిగా ఉన్న రాంబాబును కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాములా పెంచారని, అతడిపై గతంలోనే పలు కేసులున్నాయని కర్నె అన్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏ విచారణ సంస్థతో విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. హత్యారాజకీయాలకు తెరాస వ్యతిరేకమని, కాంగ్రెస్‌‌కే మొదటి నుంచీ అలాంటి అలవాటు ఉందన్నారు.

 కాల్ లిస్ట్‌ల సవాల్

కాల్ లిస్ట్‌ల సవాల్

మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు సీఎం కేసీఆర్‌.. శ్రీనివాస్‌ హత్యకు బాధ్యత వహించాలనడం కాంగ్రెస్‌ నేతల పిచ్చితనానికి నిదర్శనమని కర్నె ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వీరేశం ఫోన్‌ కాల్స్‌ లిస్ట్‌ బయటపెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ను వెల్లడించాలన్నారు.

English summary
The Telangana unit of the Congress lashed out against the state government on Friday and demanded a CBI enquiry into the murder of their party leader B Srinivas in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X