వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్... గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్ధిక విధానలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు ముట్టడికి యత్నించారు. ఇందుకోసం గాంధిభవన్‌ను నుండి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ర్యాలీలో ఏఐసీసీ నేతలతోపాటు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ కుంతియా‌తోపాటు రాష్ట్ర నాయకులు, బట్టి విక్రమార్క,జానారెడ్డితోపాటు ఇతర సీనియర్ రాష్ట్ర నేతలు ఉన్నారు.

నో మనీ.. బట్ హౌ: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా..?నో మనీ.. బట్ హౌ: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా..?

అయితే కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ వద్దే నేతలను నిలువరించారు. దీంతో పార్టీ కార్యకర్తలు అందోళనకు దిగారు. పార్టీ నేతలను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకుని పార్టీ నేతలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంధర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. కాగా పోలీసుల అరెస్ట్‌పై సీఎల్పీ నేతల భట్టివిక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుంతంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.

 congress called for chalo Raj Bhavan

మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధానాలను ఆయన దుయ్యబట్టారు. కేంద్రం నిర్ణయంతో ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటీ నిర్ణయాలు భారత ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చాయని ఆయన ఆరోపించారు. దీంతో జీడీపీ సైతం పడిపోయిందని, విదేశీపెట్టుబడులు తగ్గిపోయాయని అన్నారు. ఇక పారిశ్రామిక రంగంతో పాటు పలు పెట్టుబడి రంగాలు కుదేలయ్యాయని ....దీనివల్ల లక్షల ఉద్యోగాలు యువత కోల్పోయారని ఆయన ఆరోపించారు.

English summary
Congress called for nationwide agitation against central economic policies.behalf this Telangana Congress Party held a rally gandhi to Rajbhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X