హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈవీఎంలలో అవకతవకలు, వీవీప్యాట్‌లు లెక్కించండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కనిపించింది. తెరాస దాదాపు 86 స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. మహాకూటమి 23 స్థానాల్లో సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ రెండు, మజ్లిస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది.

మహాకూటమి, తెరాస మధ్య పోటాపోటీ ఉంటుందని భావించారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ కూటమి దారుణ ఓటమి చవి చూసింది. టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కంటే 26 సీట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈవీఎంల పై అనుమానం వ్యక్తం చేస్తోంది.

Congress complaint to CEO Rajat Kumar raising suspicions that EVMs

తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పలువురు తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, టాంపరింగ్ జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు తమ ఫిర్యాదులో.. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, వీవీప్యాట్ పేపర్లను లెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Congress complaint to CEO Rajat Kumar raising suspicions that EVMs

English summary
Congress delegation submits a complaint to Telangana Chief Electoral Officer (CEO) Rajat Kumar raising suspicions that Electronic Voting Machines (EVMs) have been manipulated in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X