వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ డిమాండ్ ; ప్రలోభాల వీడియోలతో ఈసీకి ఫిర్యాదు !!

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో టిఆర్ఎస్, బిజెపిల మధ్య డబ్బుల పంపకాలపై పరస్పర ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన డబ్బుల పంపిణీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట టిఆర్ఎస్ పార్టీ ఓటుకు ఆరువేల రూపాయలు చొప్పున పంపిణీ చేసినట్టు వీడియోలు వైరల్ కాగా, తాజాగా బీజేపీ పది వేల రూపాయల నగదు పంపిణీ చేస్తున్నట్టు వీడియోలు వైరల్ గా మారాయి.

కేంద్ర ఎన్నికల కమీషనర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
అయితే ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజా రాజకీయ పరిణామాలతో హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Congress demands cancellation of Huzurabad by-election; Complain to EC with videos !!

ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
ఓటుకు ఆరు వేల నుండి పదివేల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతూ, ఓట్లను కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు బహుమతులను ఇవ్వడం, ఓట్లు కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటివి జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

హుజురాబాద్ లో మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయల పంపిణీ
మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇంత ఘోరంగా, విచ్చలవిడిగా ఇంతకుముందు ఎప్పుడూ అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, వేణుగోపాల్ తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కు ఫిర్యాదు చేసే వారిలో ఉన్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ నిర్ణయం అందుకే
హుజురాబాద్ పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం ఈ తరహా ప్రయత్నాలు చేస్తోందని చర్చ జరుగుతుంది. అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై భవిష్యత్తులో ఏం చెప్పాలన్న దానిపై ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఉప ఎన్నిక కాగా ఈ నెల 30వ తీదీన పోలింగ్ కు హుజురాబాద్ రెడీ అవుతుంది.

English summary
Congress party alleges that it is paying between Rs 6,000 and Rs 20,000 per vote in the Huzurabad by-election. The Congress is going to complain to the EC with videos of temptations demanding the cancellation of the Huzurabad by-poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X