హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు కానీ

మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఏం హామీ ఇచ్చింది? ఆయనకు ఏం పదవి ఇస్తారు? ఎంతోమంది సీనియర్లు ఉన్న పార్టీలో రేవంత్‌కు ఉండే బాధ్యతలు ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మార

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఏం హామీ ఇచ్చింది? ఆయనకు ఏం పదవి ఇస్తారు? ఎంతోమంది సీనియర్లు ఉన్న పార్టీలో రేవంత్‌కు ఉండే బాధ్యతలు ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రేవంత్‌కు బిగ్ షాక్, రివర్స్: వెంట వచ్చిన వాళ్లు తిరిగి టీడీపీలోకిరేవంత్‌కు బిగ్ షాక్, రివర్స్: వెంట వచ్చిన వాళ్లు తిరిగి టీడీపీలోకి

రేవంత్ రెడ్డికి ప్రచార బాధ్యతలు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వవచ్చునని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఇదే అంశం ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోను ప్రధానంగా చర్చకు దారి తీస్తోందని తెలుస్తోంది.

రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు: చంద్రబాబు ఆసక్తికరంరాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు: చంద్రబాబు ఆసక్తికరం

 రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు కానీ

రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు కానీ

రేవంత్ రెడ్డికి ప్రచార చైర్మన్ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ కచ్చితంగా చెప్పలేమని కొందరు కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది. ఆయనకు ఏ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరికొందరు ఆయనకు ముఖ్యమైన పదవి ఇవ్వడం సరికాదని సీనియర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

 విభజన తర్వాత తొలిసారి ఇలా, అదీ రేవంత్ సత్తా

విభజన తర్వాత తొలిసారి ఇలా, అదీ రేవంత్ సత్తా

రాష్ట్ర విభజన తర్వాత ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి. కానీ ప్రతిపక్షంలోకి ఇలా కొనసాగడం ఇదే ప్రథమం అని గుర్తు చేస్తున్నారు. రేవంత్‌తో పాటు పెద్ద ఎత్తున ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాబట్టి ఆయన సామర్థ్యం ఇట్టే తెలిసిపోతోందని, కాబట్టి ఆయనకు కీలక పదవి ఇవ్వాలని మరికొందరు సీనియర్లకు చెబుతున్నారు.

 ఈక్వేషన్ తగ్గించారు

ఈక్వేషన్ తగ్గించారు

కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఈక్వేషన్ తగ్గించాడని అంటున్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్‌కు గట్టి పోటీని ఇచ్చే పార్టీ తెలంగాణలో లేదని చెప్పేవారని, రేవంత్ చేరిక అనంతరం కాంగ్రెస్ మాత్రమే అధికార పార్టీకి షాకిచ్చేలా కనిపిస్తోందని గుర్తు చేస్తున్నారు.

ఆ మచ్చ మాత్రం కాంగ్రెస్‌కు మైనస్

ఆ మచ్చ మాత్రం కాంగ్రెస్‌కు మైనస్

ఓటుకు నోటులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, కీలక పదవులు ఇస్తే అది పార్టీకి మైనస్ అవుతుందని కొందరు నేతలు ఇప్పటికీ వాపోతున్నారని తెలుస్తోంది. కాగా, రేవంత్ కూడా ప్రచార బాధ్యతలు ఇస్తారని గట్టిగా నమ్మకంతో ఉన్నారని సమాచారం. ఆయనతో పాటు వచ్చిన వారికి కూడా కొందరికి పదవులు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కనున్నాయి.

English summary
Congress emerging as a major force against Telangana Rastra Samithi after joining Revanth Reddy from Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X