వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

39మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు, ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే? రంగంలో మాజీ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

39మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు...!

హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పలువురు అభ్యర్థులను ఫైనల్ చేసింది. మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తిగా కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా రెండు రోజుల సమయం కోరారు. ఈ నెల 14న హైపవర్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ త్వరలో హైదరాబాద్ రానున్నారు.

కసరత్తు పూర్తయ్యాక భక్తచరణ్ దాస్‌కు నివేదిక ఇవ్వనున్నారు. 16న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పంపించనున్నారు. 18న ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఈ రోజు మరోసారి భేటీ కానుంది.

కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!

 ఎన్నికల బరిలో మాజీ ఎంపీలు

ఎన్నికల బరిలో మాజీ ఎంపీలు

తెలంగాణ అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీలు దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఐదుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించింది. సురేష్ షెట్కార్ (నారాయణపేట), రమేష్ రాథోడ్ (ఖానాపూర్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)ల నుంచి పోటీ చేయవచ్చునని ప్రతిపాదించింది.

సబితా ఇంద్రారెడ్డికి, కొడుకుకు టిక్కెట్

సబితా ఇంద్రారెడ్డికి, కొడుకుకు టిక్కెట్

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్‌లకు టిక్కెట్ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్య నేతలకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. సబితా ఇంద్రా రెడ్డి - మహేశ్వరం, కార్తీక్ రెడ్డి (సబితా ఇంద్రారెడ్డి తనయుడు) - రాజేంద్రనగర్, పొన్నాల లక్ష్మయ్య - జనగామ, కూన శ్రీశైలం గౌడ్ - కుత్బుల్లాపూర్, సుధీర్ రెడ్డి - ఎల్బీ నగర్, ప్రతాప్ రెడ్డి - షాద్ నగర్, షబ్బీర్ అలీ - కామారెడ్డి, సుదర్శన్ రెడ్డి - బోధన్, శ్రీధర్ బాబు - మంథని.

 కొండంగల్ నుంచి రేవంత్ రెడ్డి

కొండంగల్ నుంచి రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి - కొడంగల్, గండ్ర వెంకటరమణా రెడ్డి - భూపాలపల్లి, మహేశ్వర్ రెడ్డి - నిర్మల్, జీవన్ రెడ్డి - జగిత్యాల, బలరాం నాయక్ - మహబూబాబాద్, దొంతి మాధవ రెడ్డి - నర్సంపేట, గీతా రెడ్డి - జహీరాబాద్, దామోదర రాజనర్సింహ - ఆందోల్, జానారెడ్డి - నాగార్జున సాగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి - హుజూర్ నగర్,

పరకాల నుంచి కొండా సురేఖ, రంగంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పరకాల నుంచి కొండా సురేఖ, రంగంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


కొండా సురేఖ - పరకాల, పద్మావతి (ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి) - కోదాడ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి - నల్గొండ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మునుగోడు, సురేష్ షెట్కార్ - నారాయణఖేడ్, రమేష్ రాథోడ్ - ఖానాపూర్, పొన్నం ప్రభాకర్ - కరీంనగర్, సునితా లక్ష్మారెడ్డి - నర్సాపూర్, వంశీచంద్ రెడ్డి - కల్వకుర్తి, డీకే అరుణ - గద్వాల, సంపత్ కుమార్ - ఆలంపూర్, ఆరేపల్లి మోహన్ - మానకొండూరు, చిన్నారెడ్డి - వనపర్తి, జగ్గారెడ్డి - సంగారెడ్డి.

English summary
Congress to field 5 former MPs in Telangana Assembly Elections. 39 candidates finalised. Congress will announce soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X