• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!

|

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఈటల రాజేందర్ బర్తరఫ్ తో మొలైన హైడ్రామా రోజుకో ఆసక్తికర మలుపు తిరుగుతున్నది. కాంగ్రెస్ క్యాండిడేట్ గా భావించిన పైడి కౌశిక్ రెడ్డి సొంత పార్టీకే ఝలకిచ్చి, టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడం, ఆ వెంటనే ఆయనపై కాంగ్రెస్ వేటేయడం, ప్రతిగా టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డిని ముమైత్ ఖాత్ తో పోల్చుతూ కౌశిక్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

ఇంటిదొంగను పట్టుకోవడం ద్వారా అధికార పార్టీ ఎత్తులకు రేవంత్ ఘాటైన కౌంటరిచ్చారు. ఇప్పడు కాంగ్రెస్ నేతలు కౌశిక్ పై ఎదురుదాడి చేస్తుండగా, అటు సీఎం కేసీఆర్.. హుజూరాబాద్ పై సీరియస్ గా ఫోకస్ పెంచారు. వివరాలివి..

రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి..

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి..

హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉంటూ, టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగుతానని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియోను లీక్ చేసింది రేవంత్ రెడ్డే అని స్వయంగా కౌశికే వెల్లడించారు. పార్టీ వేటేసిన తర్వాత తానే రాజీనామా చేసినట్లు ప్రకటించిన కౌశిక్.. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ రాగానే సీఎం అయిపోయినట్లుగా రేవంత్ ఫీలయితున్నాడని, నిజానికి కాంగ్రెస్ లో రేవంత్ ఓ ముమైత్ ఖాన్(ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్) అని తిట్టిపోశారు.

ఈ కామెంట్లపై కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా బదులిస్తున్నారు. రేవంత్ ముమైత్ కాబోడని, కౌశిక్ రెడ్డే అచ్చం శ్రీరెడ్డి(నటి)లా వ్యవహరిస్తున్నాడని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలి. ముమైత్ ఖాన్‌తో పోలుస్తావా బిడ్డా.. నువ్వు శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు. నువ్వు, నీ అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నరు''అని కృష్ణారెడ్డి అన్నారు. అంతేకాదు,

ఏంది? వైఎస్ నీకు టికెట్ ఇస్తనన్నడా?

ఏంది? వైఎస్ నీకు టికెట్ ఇస్తనన్నడా?

కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన తర్వాత కౌశిక్ రెడ్డి మీడయాతో మాట్లాడుతూ.. గతంలో తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డే స్వయంగా టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడని చెప్పుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కృష్ణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఏంది బిడ్డా? వైఎస్ నీకు టికెట్ ఇస్తా అని చెప్పిండా, అప్పుడు నీ వయస్సు ఎంత, చెడ్డిలు కూడ వేసుకోలేదు. అత్తాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్, తిరుమల నగర్ పెట్రోల్ బంక్ రెండింటినీ కౌశిక్ లీజు తీసుకున్నాడు. లీజ్ అగ్రిమెంట్ తర్వాత వాటిని మూతపెట్టి, అత్తాపూర్ పెట్రోల్ బంక్ ఉన్న ప్రభుత్వ స్థలం 25 గుంటలను కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టారు. కౌశిక్ రెడ్డికి కుక్కల ఫామ్, ఈటల రాజేందర్ కు కోళ్ల ఫామ్ ఉన్నాయి'' అని కృష్ణారెడ్డి అన్నారు. ఇక,

షాకింగ్: భారత్‌లో కొవిడ్ 3వ వేవ్ -జులై 4నే మొదలైంది: హైదరాబాద్ ఫిజిసిస్ట్ -461రోజుల డేటాతోషాకింగ్: భారత్‌లో కొవిడ్ 3వ వేవ్ -జులై 4నే మొదలైంది: హైదరాబాద్ ఫిజిసిస్ట్ -461రోజుల డేటాతో

కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్

ఈటల రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకున్న కౌశిక్ రెడ్డి కాస్తా సొంత పార్టీకి ఝలక్ ఇవ్వడంతో ఇప్పుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అవకాశాలు పెరిగాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి మొదలైన తర్వాత పొన్నం సొంతగా ప్రచారం చేసుకుంటుండగా, కౌశిక్ రెడ్డి వర్గం వారిని అడ్డుకుంది. అలా మొదలైన గొడవలు చివరికి కౌశిక్ బహిష్కరణ దాకా వెళ్లాయి. అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించకున్నా, పొన్నం సైలెంటుగా ప్రచారంలో మునిగిపోయారు. చివరినిమిషంలో అనూహ్య నిర్ణయాలు లేకపోతే, పొన్నం అభ్యర్థిత్వం దాదాపు ఖరారే అని తెలుస్తోంది. మరోవైపు,

ప్రగతి భవన్‌లో ఆ 5 గంటలు

ప్రగతి భవన్‌లో ఆ 5 గంటలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల్లోనూ సమీకరణాలు మారుతుండటం, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కౌశిక్ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారాల నడుమ, సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 10.30 వరకు ప్రగతి భవన్ వేదికగా కీలక భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేరుగా సీఎం కేసీఆరే వీరికి దిశానిర్దేశం చేశారని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భేటీలో పాల్గొన్నారని తెలుస్తోంది. హుజూరాబాద్ స్థానంలోని 5 మండ‌లాల జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌ల‌తో స‌హా ముఖ్య‌నాయ‌కుల‌తో పాటు ఓ మంత్రి కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సమావేశమయ్యారని తెలుస్తోంది. ముద్ద‌సాని మాల‌తి, ముద్ద‌సాని పురుషోత్తం, పాడికౌశిక్ రెడ్డి, అలాగే స్వ‌ర్గం ర‌వి, గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ల్లో ఒక‌రికి టీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశముంది. కాగా,

పీసీసీగా రేవంత్ తొలి విజయం

పీసీసీగా రేవంత్ తొలి విజయం

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయిస్తుండటం తెలిసిందే. ఏకంగా సీఎల్పీనే టీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించినా కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లారే తప్ప నోటికి పని చెప్పలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే ‘ఫిరాయింపు నేతల్ని రాళ్లతో కొట్టి చంపాలి'అనడం, ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగి, చివరికి కేసీఆర్ మూలాలు కూడా టీడీపీలోనే ఉన్నాయనే కౌంటర్ తో రేవంత్ ఆకట్టుకోవడం విదితమే.

హుజూరాబాద్ కు సంబంధించి కౌశిక్ రెడ్డికి టికెట్ ప్రకటించిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి జంప్ అయి ఉంటే అది మరింత పరువు తక్కువ వ్యవహారం అయ్యేది. అంతదాకా పోనీయకుండా, కేసీఆర్, టీఆర్ఎస్ ల వ్యూహాన్ని ముందే పసిగట్టి, ఉద్దేశపూర్వకంగానే కౌశిక్ రెడ్డి ఆడియోను లీక్ చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టడంతోపాటు, ఇంటి దొంగల తొడలు విరగ్గొడతానని హెచ్చరించడం ద్వారా రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ చాటుకున్నారు. ఇంటి దొంగల్ని ముందే పసిగట్టడంతో పీసీసీగా ఆయన తొలి విజయం సాధించినట్లయిందనే చర్చ నడుస్తోంది.

English summary
congress leaders hits back on Padi Kaushik Reddy, comparing him with acress sri reddy for criticizing TPCC chief chief Revant Reddy and compared him with actress Mumait khan. it is learned that cm kcr held 5 hours long meeting on huzurabad by election. amid koushik reddy resign, ponnam prabhakar would be the congress candidate in huzurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X