వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయశాంతి దారెటు? హైకమాండ్ చెప్పినా చేయలేకపోతున్నానంటూ ఆవేదన..

|
Google Oneindia TeluguNews

''మొదటి నుండి నిర్మాణాత్మకమైన ఉద్యమాలు అలవాటైన నా మనస్తత్వానికి.. ప్రజా క్షేత్రంలో మరింత దూకుడుగా పోరాటాలు చేయాల్సిన అవసరముందని చాలా సార్లు అనిపిస్తోంది. మా పార్టీ హైకమాండ్ అనుమతించిన తర్వాత కూడా ఎందుకో నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను.. తెలియని కారణాలతో నా కార్యాచరణలో మార్పులు సంభవిస్తున్నాయి.. ''అంటూ ప్రస్తుత రాజకీయాల్లో తన పాత్రను విశ్లేషించుకున్నారు కాంగ్రెస్ నేత, ప్రఖ్యాత నటి విజయశాంతి. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆమె చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.

పొలిటికల్ జర్నీపై రివ్యూ..

పొలిటికల్ జర్నీపై రివ్యూ..


స్వతహాగా ఉద్యమ మనస్తత్వమే అయినప్పటికీ, కార్యక్రమాలకు పార్టీ హైకమాండ్ సైతం అనుమతించినప్పటికీ.. తాను చేపట్టాలనుకున్న ప్రజాపోరాట యాత్రలు అనుకోని కారణాలవల్ల రద్దు కావడం, కార్యాచరణలో ఊహించని విధంగా మార్పులు జరగడం ఎందుకు సంభవించాయో అర్థం కావడంలేదని విజయశాంతి వాపోయారు. అయితే కాంగ్రెస్ నేతగా ఏడో ఏట అడుగుపెట్టనున్న సందర్బంలో తన పొలికల్ జర్నీని ఒకసారి రివ్యూ చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

ఆగట్టా? ఈ గట్టా?

ఆగట్టా? ఈ గట్టా?

సొంత పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి.. తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరడం, ఆమె ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ కల సాకారం కావడం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఫలితాల తర్వాత క్రమంగా పొలిటికల్ యాక్టివిటీ తగ్గించి, మళ్లీ సినిమాల బాట పట్టారు. దశాబ్దాల గ్యాప్ తర్వాత విజయశాంతి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' హింట్ కావడంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆమె సినిమాలకే పరిమితం అవుతారా? మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

Recommended Video

Shabbir Ali Birthday Celebrations | Oneindia Telugu
ఈ క్లారిటీ సరిపోతుందా?

ఈ క్లారిటీ సరిపోతుందా?

2014లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి ఫొటోను షేర్ చేసిన విజయశాంతి.. ‘‘ఫిబ్రవరి 25 నాటికి కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణం ఏడో సంవత్సరానికి చేరింది. ఇంతకాలం నాకు అండగా నిలిచిన ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు''అని రాసుకొచ్చారు. ఏడేళ్ల ప్రయాణాన్ని రివ్యూ చేసుకుని, ప్రజల సంక్షేమమే ప్రాధాన్యంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.

English summary
Telangana Congress Campaign Committee Chairperson, actress Vijayashanti took facebook on the occasion of her entry into congress party, says its review time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X