హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడ్చిన ముత్యం రెడ్డి, ఓదార్చిన హరీష్ రావు: కాంగ్రెస్‌కు భారీ షాక్, తెరాసలోకి మాజీ మంత్రి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : తెరాసలోకి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి | Oneindia Telugu

హైదరాబాద్/సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తెరాస పార్టీలో చేరనున్నారు. ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని కంటతడి పెడ్డారు.

ఆయన ఏడుస్తుండగా.. హరీష్ రావు ఆయనను ఊరుకుంచారు. కంటతడి పెట్టవద్దని సముదాయించారు. ఆయన ఈ నెల 20వ తేదీన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరనున్నారు.

ముత్యం రెడ్డి ఇంటికి హరీష్ రావు

ముత్యం రెడ్డి ఇంటికి హరీష్ రావు

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించకపోవడంతో ముత్యం రెడ్డి కలత చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనను హరీష్ రావు తెరాసలోకి ఆహ్వానించారు. తొగుటలోని ముత్యంరెడ్డి నివాసానికి హరీశ్ రావు వెళ్లారు.

మీలాంటి సీనియర్లు కంటతడి పెట్టవద్దు

మీలాంటి సీనియర్లు కంటతడి పెట్టవద్దు

హరీష్ రావు మాట్లాడుతూ... సీనియర్ నాయకులు కంటతడి పెట్టవద్దని చెప్పారు. ఆయనను సముదాయించారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందింది కేవలం ముత్యం రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి వల్లే అని చెప్పారు. తెరాసలో చేరేందుకు ముత్యంరెడ్డి సానుకూలంగా స్పందించారని, 20వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారన్నారు. ఆయన చేరికతో ఉమ్మడి మెదక్‌లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.

నాలాంటి వాళ్లు కాంగ్రెస్‌కు వద్దు!

నాలాంటి వాళ్లు కాంగ్రెస్‌కు వద్దు!

ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. తనకు తప్పు చేయడం, లంచాలు తీసుకోవడం తెలియదన్నారు. ఈ ఎన్నికల్లో తనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా పెట్టిందో అర్థం కావట్లేదని వాపోయారు. నీతినిజాయితీతో ఉండే తనలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదన్నారు. తనకు తప్పు చేయడం తెలియదని, లంచాలు తీసుకోలేదన్నారు.

కూటమిలో భాగంగా తెజసకు సీటు

కూటమిలో భాగంగా తెజసకు సీటు

ఇక్కడి నుంచి రామలింగారెడ్డిని ఓడించాలంటే ముత్యం రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావించింది. కానీ కూటమి సీట్లలో భాగంగా దుబ్బాక స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయించింది. ముత్యం రెడ్డి పార్టీ వీడటం కాంగ్రెస్‌కు భారీ షాక్. తెరాస తరఫున రామలింగా రెడ్డి, టీజేఎస్ తరఫున రాజ్ కుమార్ బరిలో నిలుస్తున్నారు. ముత్యం రెడ్డి దుబ్బాకలోనే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కీలక నేత. ఆయన చేరికతో తెరాసకు మరింత లబ్ధి చేకూరుతుందని, పార్టీ బలపడుతుందని హరీష్ రావు భావిస్తున్నారు. పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని చెప్పారు.

English summary
Congress leader and former minister Cheruku Muthyam Reddy will join TRS, He weeps at Minister Harish Rao on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X