హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజహరుద్దీన్ మనోడేనా, రాజకీయ కుట్ర, పాకిస్థాన్ కోడై కూస్తోంది: విహెచ్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత క్రికెట్ జట్లు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌ను హెచ్ సీ ఏ సమావేశానికి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అజహరుద్దీన్ కు జరిగిన అవమానంపై పాకిస్థాన్‌ కోడై కూస్తోందని వి. హనుమంతరావు చెప్పారు. అజహరుద్దీన్ మనవాడేనా, కాదా చెప్పాలని వి. హనుమంతరావు ప్రశ్నించారు.

పవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్‌, వైఎస్ఆర్‌ కోసం రాజీవ్‌ను ఒప్పించా: వి.హెచ్.సంచలనంపవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్‌, వైఎస్ఆర్‌ కోసం రాజీవ్‌ను ఒప్పించా: వి.హెచ్.సంచలనం

ఇటీవల కాలంలో హెచ్ సి ఏ సమావేశానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ‌ను అనుమతివ్వలేదు. సుమారు రెండు గంటల పాటు అజహరుద్దీన్ ఈ సమావేశానికి హజరుకాకుండానే బయటనే నిలిపారు.

క్రికెట్, రాజకీయాలు రెండు కళ్లు, అసదుద్దీన్‌పై పోటీపై అజహరుద్దీన్ ఏం చెప్పారంటే?క్రికెట్, రాజకీయాలు రెండు కళ్లు, అసదుద్దీన్‌పై పోటీపై అజహరుద్దీన్ ఏం చెప్పారంటే?

ఈ విషయమై హెచ్ సి ఏ సమావేశంలో వి. హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పరిణామాలపై వి. హనుమంతరావు మరోసారి హెచ్ సి ఏ తీరును తప్పుబట్టారు.అజహరుద్దీన్ కూడ హెచ్ సి ఏ తీరుపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్

అజహరుద్దీన్ మనవాడేనా కాదా

అజహరుద్దీన్ మనవాడేనా కాదా


అజహరుద్దీన్ ను హెచ్ సి ఏ సమావేశానికి అనుమతించకపోవడం పై వి. హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవసరం తీరాక ముందు ఓ రకంగా, అవసరం తీరిన తర్వాత మరో రకంగా వ్యవహరించడం సరికాదని వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. అజహరుద్దీన్ మనవాడు కాదా తేల్చి చెప్పాలని ఆయన కోరారు. అజహరుద్దీన్ కు జరిగిన అవమానంపై పాకిస్థాన్ లో తీవ్ర ప్రచారం జరుగుతున్న విషయాన్ని వి. హనుమంతరావు ప్రస్తావించారు. అజహర్ మనవాడా, కాదా అనే విషయాన్ని సీఎం కెసిఆర్ తేల్చి చెప్పాలని ఆయన కోరారు.

క్లీన్ చిట్ ఇచ్చినా అనుమతించరా

క్లీన్ చిట్ ఇచ్చినా అనుమతించరా


అజారుద్దీన్ హెచ్‌సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు విమర్శలు గుప్పించారు.

అజహర్ పై రాజకీయంగా కుట్ర

అజహర్ పై రాజకీయంగా కుట్ర

అజహరుద్దీన్ పై రాజకీయంగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు ఆరోపణలు గుప్పించారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు.తాను రాజకీయ కుట్రలతో హెచ్‌సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ మాట్లాడడాన్ని వి. హెచ్ తప్పుబట్టారు

తెలంగాణ క్రికెట్ క్లబ్ ఉంటే నష్టమేమిటీ

తెలంగాణ క్రికెట్ క్లబ్ ఉంటే నష్టమేమిటీ

తెలంగాణ క్రికెట్ క్లబ్ ఉంటే నష్టమేమిటని వి. హనుమంతరావు ప్రశ్నించారు.అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్‌సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు.తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్‌ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు.

English summary
Congress leader fired on HCA president Vivek on Thursday.HCA president Vivek said that intentionally stopped to Azharuddin to HCA meeting said Congress leader V. Hanumantha Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X