• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేటీఆర్‌ను కలవడంపై కౌశిక్ రెడ్డి రియాక్షన్-చెవిలో అదే చెప్పానన్న కాంగ్రెస్ నేత-ఆ ప్రచారంలో నిజం లేదని...

|

హుజురాబాద్ ఉపఎన్నికపై ప్రస్తుతం తెలంగాణలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఆచీ తూచీ మాట్లాడుతూ వచ్చిన ఈటల... ఒక్కసారిగా స్వరం పెంచడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని... ఇది కౌరవులకు-పాండవులకు మధ్య యుద్ధమని ఆయన ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కలవడం... ఉపఎన్నికలో గులాబీ అభ్యర్థి ఆయనేనా అన్న ఊహాగానాలకు తావిచ్చింది. తాజాగా కౌశిక్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి...

క్లారిటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి...

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తనను పార్టీలోకి ఆహ్వానించిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశానని... ఇప్పుడు కూడా అదే పార్టీ తరుపున బరిలో ఉంటానని చెప్పారు. హుజురాబాద్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ కేటాయిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

కేటీఆర్‌ను కలవడంపై...

కేటీఆర్‌ను కలవడంపై...


కేటీఆర్‌ను కలవడంపై కౌశిక్ రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలోనూ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటి పక్కనే ఉండే చిన్ననాటి మిత్రుడి తండ్రి ఇటీవల చనిపోయారని... ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి తాను వెళ్లానని చెప్పారు. ఆ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా వచ్చారని తెలిపారు. యాధృచ్చికంగా కలవడమే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ అంశాలకు తావు లేదన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌కు చెవిలో ఏదో చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలపై కూడా కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో స్పందించారు. రాబోయే ఉపఎన్నికలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పానన్నారు.

ఈటలపై విమర్శలు...

ఈటలపై విమర్శలు...


అవినీతిపరుడైన ఈటల రాజేందర్... ధర్మం,అధర్మం గురించి మాట్లాడటం పెద్ద జోక్ అని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఆయన చేసిన స్కామ్ రాష్ట్రమంతా గమనిస్తోందన్నారు. రాజీనామాకు ముందు..గన్ పార్క్‌కు వెళ్లిన ఈటల... గత ఏడున్నర ఏళ్లలో ఒక్కసారైనా తెలంగాణ అమరుల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా అని నిలదీశారు. కేవలం అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూమలు కొనవద్దన్న విషయం ఆయనకు తెలియదా అని మండిపడ్డారు.

ఈటల రాజీనామా... స్పీకర్ ఆమోదం

ఈటల రాజీనామా... స్పీకర్ ఆమోదం

ఈటల రాజీనామా చేయడం,స్పీకర్ దాన్ని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.దీంతో త్వరలోనే ఈసీ ఉపఎన్నికపై నిర్ణయం తీసుకోనుంది. రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ... ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన డీఎన్ఏ ఒకప్పుడు లెఫ్ట్ కావొచ్చు... కానీ ఇప్పుడు తన టార్గెట్ తెలంగాణలో నియంతృత్వ పాలనకు సమాధి కట్టడమేనని అన్నారు.తనకు నిర్బంధాలు కొత్త కాదని... నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. తనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమ,కేశవరెడ్డి,గండ్ర నళిని బీజేపీలో చేరుతారని తెలిపారు.

English summary
Congress leader Kaushik Reddy has made it clear that he will continue in the party. He said there was no truth in the propaganda that TRS had invited him to their party. He said that he had contested from Huzurabad on behalf of the Congress in the last elections and will still be in the ring on behalf of the same party. Dheema said the Congress party had won this time in Huzurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X