వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ షాక్.. ఏదో అనాలనే అంటున్నాం! కెసిఆర్ భేష్: మెచ్చుకున్న కాంగ్రెస్ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, టిఆర్ఎస్ పాలనను ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శుక్రవారం నాడు మెచ్చుకున్నారు. త్వరలో వరంగల్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ.. కెసిఆర్ పైన, టిఆర్ఎస్ పాలన పైన ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఎమ్మెస్సార్ శుక్రవారం మాట్లాడారు. కెసిఆర్ పాలనను మెచ్చుకున్నారు.

మిషన్ కాకతీయ, గ్రామజ్యోతితో అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ విధానం కూడా చాలా బాగుందని కితాబిచ్చారు. ఏదో ఒకటి అనాలి కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

కెసిఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. అందర్నీ కలుపుకొని కెసిఆర్ వెళ్లాలని చెప్పారు. కెసిఆర్ ఏదో ఒక పనిని బాగానే చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. కెసిఆర్ దూకుడుగా వెళ్తే మాత్రం ప్రజలు బుద్ధఇ చెబుతారన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ కొన్నేళ్లు ఆగాలన్నారు.

 Congress leader MSR praises CM KCR

డ్రైవర్ కూతురు పెళ్లికి కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు తన డ్రైవర్ బాలయ్య కూతురు పెళ్లికి హాజరయ్యారు. హకీంపేటలో ఈ వివాహ వేడుక జరిగింది.

కొత్త బిచ్చగాళ్లల విపక్షాలు : సీతారాం నాయక్

రాష్ట్రంలో విపక్షాల తీరు కొత్త బిచ్చగాళ్లలా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ విమర్శించారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ సీతారాం పాల్గొన్నారు. కడిపికొండ నుంచి కాజీపేట వరకు నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

అందరి చూపు వరంగల్ ఉప ఎన్నిక వైపే: కేటీఆర్

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే, తెలంగాణ మొత్తం వరంగల్ వైపే చూస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

కడిపికొండ నుంచి కాజీపేట వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి మాట్లాడారు. ఉప ఎన్నికలో ప్రజలు ఏం తీర్పు ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పదహారు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు.

English summary
Telangana Congress leader MSR praises CM KCR on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X