వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబునే ఏంపని అన్నాడు, సెటిలర్లని తరిమేయడా: శ్రవణ్, కెసిఆర్! ఎక్కడికీ పోను: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ఆత్మగౌరవంతో ఆటలు ఆడుకుంటున్నారని, టిడిపి అధినేత చంద్రబాబుకు హైదరాబాదులో ఏం పని అన్న తెలంగాణ సీఎం కెసిఆర్ రేపు సెటిలర్లను తరిమేయడని గ్యారంటీ ఏమిటని కాంగ్రెస్ పార్టీ నేత శ్రవణ్ కుమార్ ఆదివారం ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు అన్నాతమ్ముళ్ల మాదిరిగా వరసలు కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాస, టిడిపి రెండు పార్టీలు ఒకటేననిపిస్తోందన్నారు.

ఇంతకాలం కెసిఆర్ పల్లకీని మోసింది బిజెపి మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలే అన్నారు. తెలంగాణ పైన కెసిఆర్ ముద్ర అంటే రెండువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమేనని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.

Congress leader Sravan blames KCR and Chandrababu

కెసిఆర్! ఎక్కడికీ పారిపోను: నారాయణ

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడే ఫిబ్రవరి 5న హైదరాబాదులో ఉండవద్దన్న కెసిఆర్ వ్యాఖ్యల పైన సిపిఐ నేత నారాయణ స్పందించారు. తనను మంచి మిత్రుడు అంటూనే పరోక్షంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను ఫలితాలు వెలువడే 5న హైదరాబాదులోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనన్నారు.

హైదరాబాద్ ఎవరి అబ్బ సొత్తు కాదన్నారు. భయపడి పారిపోయేవాడిని కాదన్నారు. నా ప్రకటన పాక్షికంగానే చెప్పారని, నేను 5వ తేదీన వివరంగా చెబుతానన్నారు. ప్రజల పేరుతో నాపై రెచ్చగొట్టాలనే కుటిల ప్రయత్నం మానుకోవాలన్నారు. హుందాగా ప్రవర్తించడం కెసిఆర్ నేర్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నానన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగా తెరాస మేయర్ పీఠం గెలుచుకుంటే నేను నా చెవులు కోసుకుంటానని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై కెసిఆర్ ఆదివారం స్పందిస్తూ... నారాయణ తనకు మంచి స్నేహితుడని, తెరాస ఒంటరిగా మేయర్ పీఠం గెల్చుకుంటే చెవులు కోసుకుంటానని చెప్పారని, నారాయణ గారు 5వ తేదీన హైదరాబాదులో ఉండవద్దని, ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్టీలో ఆపరేషన్ చేయించాలని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై నారాయణ మళ్లీ స్పందించారు.

ఆశ్చర్యం కలిగించింది: కెటిఆర్

మున్సిపల్ శాఖను తనకు ఇస్తానని సీఎం కెసిఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అయితే, అంతకుముందు ఆయన కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను నెరవేరుస్తానన్నారు. సీఎం కెసిఆర్ ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నానని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో కెటిఆర్ చెప్పారు.

English summary
Congress leader Sravan blames Telangana CM KCR and AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X