హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెహ్రూ కుటుంబ ప్రధాన్యం తగ్గించేందుకు బీజేపీ, ఆర్‌స్సెస్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు ఆరోపించారు. బాలల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వాణిచ్య ప్రకటనల్లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ ఫోటో లేకపోవడం పట్ల నిరసనగా వీహెచ్ శనివారం అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కావాలనే బీజేపీ ప్రభుత్వం నెహ్రూ ఫొటోను ప్రచురించలేదని ఆరోపించారు. బాలల దినోత్సవం రోజున నెహ్రూ ఫోటోను ముద్రించకపోవడం దేశ ప్రజలను అవమానించడమేనన్నారు.

 ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

కేంద్రం వైఖరిపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్రం వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఏడాది నుంచి పాఠశాలల విద్యార్ధులతో కలిసి ఆందోళలనలు చేపట్టాల్సి వస్తుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేంద్రం వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

కాగా, దీక్షకు మంత్రులు జానారెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎంపీ మందడి అంజన్‌కుమార్ యాదవ్, మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జి. నరేందర్‌యాదవ్ మద్దతుపలికారు.

 ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

అంతక ముందు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గాంధీ భవన్‌లో మాట్లాడుతూ జాతికి పటిష్ట పునాదులు వేసిన మహానేతల్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఒకరని అన్నారు. నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

ఫోటో రాజకీయం: నెహ్రూ ప్రాధాన్యం తగ్గించేందుకు కుట్ర

ఆధునిక భారత్ కోసం నెహ్రూ ముందుచూపుతో పని చేశారని కొనియాడారు. గాంధీ భవన్‌లో జరిగిన నెహ్రూ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

English summary
Congress leader V Hanumanthu Rao Protests at Abids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X