వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిస్ట్‌లో లేని వీహెచ్, పొన్నాల పేర్లు.. SORRYపైపెద్దాయన గరం.. సరికాదంటూ గుస్సా..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మమూలుగా ఉండవు. ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. వీటినే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలని పిలుస్తారు. శనివారం కూడా అలాంటి సీన్ ఒక్కటి క్రియేట్ అయ్యింది. మాజీ పీసీసీ చీఫ్‌లు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యకు ఆ పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. పేరంటానికి పిలిచి, అవమానించారని ఆ ఇద్దరు నేతలు మండిపడుతున్నారు.

నిర్బలను కాదు: కాంగ్రెస్ ఎంపీకి నిర్మలా సీతారామన్ కౌంటర్, చెత్త ఆర్థిక మంత్రినా?నిర్బలను కాదు: కాంగ్రెస్ ఎంపీకి నిర్మలా సీతారామన్ కౌంటర్, చెత్త ఆర్థిక మంత్రినా?

లిస్ట్‌లో లేని పేర్లు

లిస్ట్‌లో లేని పేర్లు

మహిళలపై దాడి, మద్యం నియంత్రణపై గవర్నర్‌ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ పార్టీ నేతలను పిలిచి.. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను కలిసేవారి జాబితా అందజేశారు. అందులో సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య పేర్లు కూడా ఉన్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. వారిద్దరికీ ఫోన్ చేసి మరీ పిలిచారు. కానీ రాజ్‌భవన్ వద్ద సీన్ మారిపోయింది.

 నిలిపివేసి..

నిలిపివేసి..

అప్పటికే కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్ లోపలికి వెళ్లిపోయింది. తర్వాత వీహెచ్, పొన్నాల వచ్చారు. అక్కడ అధికారులు వారిని నిలిపివేసి,, జాబితాలో పేరు లేదని చెప్పారు. దీంతో వారిద్దరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయిపోయింది. అవునా అంటూ ఆశ్చర్యపోయారు. పిలిచి మరీ అవమానించడం ఏంటి అని వీహెచ్ ఫైరయ్యారు. బీసీ నేతలు అంటే ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు.

 ఢిల్లీ నుంచి వస్తే..

ఢిల్లీ నుంచి వస్తే..

వాస్తవానికి తాను శుక్రవారం ఢిల్లీలో ఉన్నానని వీహెచ్ తెలిపారు. భట్టి విక్రమార్క ఫోన్ చేసి రావాలని కోరారని, తన పేరు కూడా జాబితాలో ఉందని చెప్పారని తెలిపారు. కానీ తీరా ఇక్కడికొచ్చాక తమ పేర్లు లేవని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పారు. తనకు భయపడి వారు లోపలికి పోనిచ్చారని.. కానీ ఇదీ మంచి పద్ధతి కాదని వీహెచ్ అన్నారు. పిలిచి అవమానించడం సరికాదని మండిపడ్డారు.

మున్నురుకాపు సమావేశం కూడా..

మున్నురుకాపు సమావేశం కూడా..

శనివారం హైదరాబాద్‌లో మున్నురుకాపు సంఘం సమావేశం ఉందని, హాజరుకావాలని కమలాకర్ రావు ఆహ్వానించడంతో తాను నగరానికి వచ్చినట్టు పేర్కొన్నారు. పనిలోపనిగా గవర్నర్ వద్దకొస్తే తమకు అవమానం జరిగిందని చెప్పారు. తాను పీసీసీ చీఫ్‌గా పనిచేశానని, పొన్నాల కూడా పనిచేశారని గుర్తుచేశారు. సీనియర్ నేతలకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడ్డారు.

English summary
congress senior leader v hanumantha rao fire on mallu bhatti vikramarka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X