హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌పై రాములమ్మ ఫైర్.. తండ్రి పర్మిషన్ తీసుకున్నారా అంటూ చురకలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఫైరయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం దోచిందన్న నడ్డా వ్యాఖ్యలు అబద్దాలని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కేటీఆర్ విసిరిన సవాల్‌పై ఆమె స్పందించారు. ఇంతకు ఇలాంటి సవాల్ చేసే ముందు మీ తండ్రి సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

నిధుల స్వాహాకు సంబంధించి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని గొంతు చించుకునే ముందు తన తనయుడు కేటీఆర్ అలా ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్ అడిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు విజయశాంతి. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రపతికి బీజేపీ నేతలు ఆధారాలు సమర్పించినట్లుగానే.. తెలంగాణలో నిధుల స్వాహాపై జేపీ నడ్డా కూడా తన దగ్గరున్న ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయాలని కోరారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిగేలా చూడాలని సూచించారు.

congress leader vijayashanti fires on trs working president ktr

ఇస్రోకు అభినందనలతో.. ఇసుక తిన్నెలపై సైకత శిల్పం.. సూపర్బ్ గురూ..!

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమైనప్పుడు కూడా కేటీఆర్ ఇలాంటి సవాలే విసిరారని ఆరోపించారు విజయశాంతి. ఆరోపణలు కాదు దమ్ముంటే ఆధారాలు చూపాలని రెచ్చిపోయి మాట్లాడారు. గ్లోబరీనాకు టీఆర్ఎస్ నేతలతో సంబంధాలున్నాయనే విషయం తనతో పాటు విపక్ష నేతలంతా ఆరోపించినప్పుడు కేటీఆర్ పక్కదారి పట్టించాలని చూసి విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. చివరకు ఆ వ్యవహారంలో ఆధారాలతో సహా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ సీఎస్‌ను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిపక్షాల కుట్ర అంటూ గొంతు చించుకోవడం కాదని.. సరైన జవాబు చెప్పగలిగేలా ఉండాలని హితవు పలికారు.

English summary
Congress Party Campaign Committee Chairperson Vijayashanti Fires On TRS Working President KTR. She questioned that weather taken permission from his father cm kcr or not while made allegations on BJP Working President JP Nadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X