వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి : లోక్‌పాల్‌కు కాంగ్రెస్ కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై లోక్ పాల్ ను ఆశ్రయించింది కాంగ్రెస్. అధికార టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది.

ప్రలోభాల పర్వం
రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఇది రాజకీయ అవినీతి కిందకు వస్తుందని ఫిర్యాదులో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి .. పార్టీలోకి లాక్కుంటున్నారని గుర్తుచేశారు. ఇది ఓ రాజకీయ పార్టీకి తగదని తెలిపింది. వెంటనే పార్టీ అధినేత కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

congress leaders complaint to lokpal against kcr

పార్టీ వీడుతున్న ఒక్కో ఎమ్మెల్యే ..
గత డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగి ... తిరిగి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రలోభాల పర్వానికి తెరతీసింది. విపక్ష కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేతో మంతనాలు జరిపింది. ఇప్పటివరకు 11 మంది ఎమ్మెల్యేలు కారెక్కుందుకు సిద్ధమని ప్రకటించి ... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎల్పీ టీఆర్ఎస్పీలో విలీనం చేస్తారని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇటు టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడంతో .. ఆ పార్టీకి సభలో ఎమ్మెల్యే లేని పరిస్థితి నెలకొంది.

English summary
Congress has approached Lok Pal on party deficiencies in Telangana state. A complaint has been made to take action against the TRS. party chief KCR and three MLAs will take action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X