India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ తన భార్య‌తో ఎందుకు సహజీవనంలో లేరో?.. హిమంత్‌కు ఎంతమంది తండ్రులని అడిగామా? : కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సంస్కారమేనా? అని ప్రశ్నిస్తున్నాయి. ఇవే మాటలు నిన్ను అంటే నీతల ఎక్కడ పెట్టుకుంటావంటూ మండిపడుతున్నాయి. ఓట్ల కోసం ఇంత చిల్లర రాజకీయాలు అవసరమా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రామాయణం, మహాభారతం, భగవద్గీత నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా..? వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మోదీ తన సతీమణితో ఎందుకు సహజీవనంలో లేరో అడిగామా?

మోదీ తన సతీమణితో ఎందుకు సహజీవనంలో లేరో అడిగామా?

రాహుల్ గాందీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అస్సాం సీఎం హిమంత, ప్రధాని మోదీ, బీజేపీ అధిష్టానం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల‌ని తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ కుమారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేనా.. వారికి బీజేపీ నేర్పిన సంస్కృతి.. సంస్కారం? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన సతీమణితో ఎందుకు సహజీవనంలో లేరో కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా అడిగిందా? ఆపార్టీ నేత‌లు మండిప‌డ్డారు. అస్సాం సీఎంను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోండి.

రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోండి.

హిమంత నీకు ఎంతమంది తండ్రులంటూ తాము ఏమైనా అడిగామా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. అస్సాం సీఎం హిమంతకు తండ్రి ఒక్కడేనా అంటూ కాంగ్రెస్‌ పార్టీ అంటే ఎలా ఉంటుంది? అని మండిపడ్డారు. అమిత్‌షాకు తండ్రి ఒక్కడేనా? ప్రధాని మోదీకి తండ్రి ఒక్కడేనా? అని అంటే వారికి బాధగా ఉంటుందా.. లేదా? అని అన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసింది. వారు స్వాతంత్య్రం తీసుకురావడం వల్లే బీజేపీ వాళ్లూ సీఎంలు అయ్యారన్నారు.. బీజేపీ నేత‌లు మూర్ఖపు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు జగ్గారెడ్డి. లేనిపక్షంలో దీనికి తగ్గట్లుగా తామూ మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రధాని మోదీ, బీజేపీ సంస్కారం ఇదేనా ?

ప్రధాని మోదీ, బీజేపీ సంస్కారం ఇదేనా ?


దేశం కోసం ప్రాణాల్పించిన కుటుంబం గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వకర్మ దిగజారి మాట్లాడతారా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంపీ రాహుల్ గాంధీని.. నువ్వు ఏ అయ్యకు పుట్టినావో అడిగినమా మేము.. అని అంటారా.. ఇలాంటి మాట అనొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ సంస్కారం ఇదేనా .. మన దేశ హిందూ ధర్మం ఇదే నేర్పిందా?.. అని ప్రశ్నించారు . రాహుల్ నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వంత్ర పోరాటం చేశారు. అనేక సంవత్సరాలు ప్రధానిమంత్రిగా దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీపై ఇంత‌ నీచాతి నీచంగా మాట్లాడిన అస్సాం సీఎంను బర్త్ రఫ్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

 4ఐదు రాష్ట్రాల్లో ఓటమి తప్పదన్న అసహంతో..

4ఐదు రాష్ట్రాల్లో ఓటమి తప్పదన్న అసహంతో..

అటు సీపీఐ కూడా అస్సాం సీఎం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాహుల్ గాంధీ పుట్టుక గురించి నీచంగా మాట్లాడిన హిమంత విశ్వశర్మను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీకి ఏం పోయే కాలం వచ్చిందని దుయ్యబట్టారు. భారతదేశంలో ఉన్న నైతిక విలువలను బీజేపీ నేతలు దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమి తప్పదన్న అసహంతో కాషాయ దళం ఉంది. అందుకే ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు.

English summary
congress leaders warning to PM modi, Assam CM Himanta vishwasharma
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X