వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీని క్యాంప్ ఆఫీస్‌కు మార్చుకోండి... కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్ ...ధర్నా చేస్తున్న నేతల అరెస్ట్...

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లొ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆందోళనబాట పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోపాటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పార్టీ విలీనానికి నిరసనగా అసెంబ్లీలోని అంబేద్కర్,గాంధీ విగ్రహల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్పికర్ స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. దీంతో సుమారు గంటపాటు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈనేపథ్యంలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ వారు నినాదాలు చేశారు. అయితే అంతకు ముందు అసెంబ్లీ అవరణలో ఉన్న గాంధీ అంబేద్కర్ విగ్రహాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్దమయ్యారు. కాని అసెంబ్లీ సెక్యూరిటి సిబ్బంది అనుమతిని ఇవ్వకపోవడంతో అసెంబ్లీ అవరణలోనే బైఠాయించారు. అనంతరం నల్ల రిబ్బన్లు ధరించి అ నిరసన వ్యక్తం చేశారు.

congress leaders have been arrested who is held protest at assembly

అరెస్టు అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డాడు. ప్రతిపక్షం లేకుండా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ ఎందుకని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీని కూడ క్యాంపు కార్యాలయానికి మార్చుకోవాలని ఎద్దేవా చేశాడు. ఏం దాచుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నాడు.. కాంట్రాక్టులు, డబ్బుల కోసమే కేసీఆర్ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా కేసీఆర్ దుశ్చర్యలపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు.

English summary
congress leaders have been arrested who is held protest at assembly. and they moved to abids police stations in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X