హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?: పార్టీ వీడుతున్న సీనియర్లు, దానం ఇంటికి ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా

హైదరాబాద్: ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇటీవల మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్‌కు భారీ షాక్: దానం నాగేందర్ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలోకి?కాంగ్రెస్‌కు భారీ షాక్: దానం నాగేందర్ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలోకి?

రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డిల చేరికపైనా పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగం చేరికతోనే దామోదర్ రెడ్డి పార్టీని వీడాల్సి వచ్చిందని డీకే అరుణ స్పష్టం చేశారు కూడా. తాజాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా కాంగ్రెస్ పార్టీతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

దిద్దుబాటు చర్యలు

దిద్దుబాటు చర్యలు

ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకొనే వ్యవహారాన్ని కాంగ్రెస్‌ చేపట్టింది. పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించేందుకు సీఎల్పీ నేత జానా రెడ్డి నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, వీహెచ్‌ హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, తదితరులు భేటీ అయ్యారు.

కాంగ్రెస్ అంతర్మథనం

కాంగ్రెస్ అంతర్మథనం

ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలంతా కలిసి ఢిల్లీకి వెళ్లి నాయకత్వ మార్పుపైనా కొన్ని ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో దానం రాజీనామా ఘటనతో పాటు మరి కొందరు నేతలు(ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్, టీ అంజయ్య పెద్ద కుమారుడు అభిషేక్ రెడ్డి) కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వస్తోన్న వార్తలు కాంగ్రెస్‌లో అంతర్మథనానికి దారితీశాయి.

కీలక చర్చ

కీలక చర్చ

ఇంకా ఎవరెవరు పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారనే అంశంతో పాటు చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు, పార్టీ బలోపేతం, క్యాడర్‌లో విశ్వాసం ఎలా నింపాలనే దానిపై జానా రెడ్డి నివాసంలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. వీలైతే పార్టీని వీడకుండా కీలక నేతలను ఆపాలనే ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

దానం ఇంటికి ఉత్తమ్

దానం ఇంటికి ఉత్తమ్

మాజీ మంత్రి దానం నాగేందర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజీనామా నేపథ్యంలో దానం ఇంటికి వెళ్లిన ఉత్తమ్‌ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న దానం శుక్రవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం మీడియా ముందుకు వచ్చి పార్టీని వీడడానికి దారి తీసిన కారణాలను వివరిస్తానని ఆయన స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో దానంను బుజ్జగించే దిశగా రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, దానం మాత్రం పార్టీని వీడేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఎల్లుండి అంటే ఆదివారం దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Telangana Congress leaders discussing on danam nagender resignation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X