వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ పరిస్థితిని చూపించి టీఆర్ఎస్ కు అదే గతి పడుతుంది అంటున్న కాంగ్రెస్ నేతలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా సీఎం కేసీఆర్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పట్టబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ఇది భవిష్యత్ టీఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు విజయశాంతి.

జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేనిజగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని

టీఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్ లో టీడీపీ గతే పడుతుందన్న షబ్బీర్ అలీ

టీఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్ లో టీడీపీ గతే పడుతుందన్న షబ్బీర్ అలీ

దేశంలోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ బీజేపీ క్రమంగా తనవైపుకు తిప్పుకుంటుందని , ప్రలోభాలకు గురి చేస్తుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ కు మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో జేడీఎస్, ఏపీలో టీడీపీకి పట్టిన గతే తెలంగాణలో టీఆర్ఎస్‌కూ పడుతుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ, బీజేపీలను ఓ కంటకనిపెడుతూ ఉండాలని కేసీఆర్‌కు షబ్బీర్ సూచించారు.ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పడుతుందన్నారు.

Recommended Video

దళితులను అవమానించిన చరిత్ర టీడీపీ దే
ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ లాగా టీఆర్ఎస్ కూడా భవిష్యత్ లో చావు దెబ్బ తింటుందన్న షబ్బీర్ అలీ

ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ లాగా టీఆర్ఎస్ కూడా భవిష్యత్ లో చావు దెబ్బ తింటుందన్న షబ్బీర్ అలీ

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ నుండి వలసలు ప్రారంభం అయ్యాయి. తాజాగా టీడీపీ రాజ్య సభ సభ్యులు నలుగురు టీడీపీ నుండి పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. ఇక ఏపీలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయిమ్పులకు ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు చంద్రబాబును దెబ్బ కొడుతూ బీజేపీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంది . ఇక నేపధ్యంలోనే నేడు టీడీపీకి పట్టిన గతే రేపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు బీజేపీలో చేరడాన్ని ఉద్దేశించి షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ తాజా పరిస్థితి టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతం అన్న విజయశాంతి

టీడీపీ తాజా పరిస్థితి టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతం అన్న విజయశాంతి

విజయశాంతి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిస్థితి చూస్తే భవిష్యత్ లో తెలంగాణాలోనూ అలాంటి పరిస్థితే రిపీట్ అవుతుందనే భావన కలుగుతుంది అని పేర్కొన్నారు . తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారక కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీలోని పరిణామాలు తెలంగాణలోని టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతంగా ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె రెండు ప్రాంతీయ పార్టీలు సమర్థవంతమైనవి అయితే జాతీయ పార్టీలకు స్థానం దొరక్కపోవచ్చునన్నది ఎంత వాస్తవమో, రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవమన్నారు.కేసీఆర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. టీడీపీ, టీఆర్ఎస్ లు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చాయని నేడు ఏపీలో ఉన్న పరిస్థితి భవిష్యత్ లో టీఆర్ఎస్ కు రాబోతుంది అని ఆమె పేర్కొన్నారు

English summary
Shabbir Ali was fired on kcr that the Telangana CM KCR will face the same situation which is now facing by Chandrababu. He said that in the future, TRS also face difficulties in the state like TDP , the future of TRS will be faded like TDP and Vijaya shanthi says this will mirror the future of TRS situation. The latest tdp situation in AP shows the fear to TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X