• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సామాజిక న్యాయం కొర‌వ‌డిన కాంగ్రెస్ జాబితాలు..! అసంత్రుప్తిలో బీసీ నాయ‌కత్వం..!!

|
  Telangana Elections 2018: కాంగ్రెస్ జాబితాల తో అసంత్రుప్తిలో ఉన్న బీసీ నాయ‌కత్వం | Oneindia Telugu

  హైద‌రాబాద్ :రెండు తెలుగు రా కాంగ్రెస్‌కు కంచుకోటగా రెడ్డి సామాజికవర్గం ఉంటున్నదనే వార్త ఎప్పటినుంచో వింటున్నదే. ఇది తాజాగా మరోమారు నిరూపితమైంది. ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాతో పాటు మ‌లి జాబితా కూడా ఆ పార్టీ విడుదల చేసింది. 65 మందితో ఉన్న ఈ జాబితాలో 23 మంది రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులను ఉండటం రెండ‌వ జాబితాలో 6మంది ఉండ‌డం గమనార్హం. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చెప్పిన విధంగా దామాషా ప్రకారం జాబితాలో బీసీలకు ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది.

  మ‌హాకూట‌మిలో బీసిల‌కు అన్యాయం జ‌రిగింది..! అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న బీసి నేత‌లు..!!

  మ‌హాకూట‌మిలో బీసిల‌కు అన్యాయం జ‌రిగింది..! అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న బీసి నేత‌లు..!!

  మహా కూటమిలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బంద్ పిలుపునిచ్చి మరో సంచలనం రేపారు. కాగా కాంగ్రెస్ పార్టీ వెలువరించే తదుపరి జాబితాలోనైనా బీసీలకు ప్రాధాన్యతనిస్తే రాహుల్ చెప్పిన మాట నిజమవుతుందంటున్నారు. ఇందుకోసం రెండో జాబితా వెల్లడయ్యే వరకూ వేచి చూసామ‌ని, అందులో కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తొలి జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికిలోనయ్యేలా చేసింది. అగ్ర వర్ణానికి చెందిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు ప్రాధాన్యతనిస్తూ బీసీ అయిన పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం చేయడమేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

  సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టిన కాంగ్రెస్..! కొత్త‌వాళ్లకు అవ‌కాశం కోస‌మే అంటున్న నాయ‌కులు..!!

  సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టిన కాంగ్రెస్..! కొత్త‌వాళ్లకు అవ‌కాశం కోస‌మే అంటున్న నాయ‌కులు..!!

  అలాగే శశిధర్‌రెడ్డికి కూడా ఎందుకు మొండిచెయ్యి చూపారనేది ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. కాగా ఖైరతాబాద్‌ సీటు పి.విష్ణువర్ధన్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరిగినా, ఆయనపేరు తొలి జాబితాలో కనిపించకుండా రెండ‌వ జాబితాలో ఉండ‌డం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ భారీ కసరత్తు చేసిందని తెలుస్తోంది. అయితే మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎంతకీ తేలకపోవడంతో పరిష్కారం కోసం రాహుల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని సమాచారం.

  రెడ్డి సామాజిక వ‌ర్గానికి పెద్ద పీఠ‌..! వ్య‌తిరేకిస్తున్న ఆర్.క్రిష్ణ‌య్య‌..!

  రెడ్డి సామాజిక వ‌ర్గానికి పెద్ద పీఠ‌..! వ్య‌తిరేకిస్తున్న ఆర్.క్రిష్ణ‌య్య‌..!

  ఎట్టకేలకు అభ్యర్థుల తొలి,మ‌లి జాబితాను ప్రకటించారు. దీంతో కొంతమంది ఆశావహులు కంగు తిన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశావహులు వారి అనుచరులు ఆందోళనలు చేపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు, ఓడినవారు, మంత్రి పదవులు చేపట్టినవారిని ఎంపిక చేయడానికి ఇంత కసరత్తు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు తుది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

  కాంగ్రెస్ వ్య‌వ‌హారం బాగాలేదు..! ఎలా అని ప్ర‌శ్నిస్తున్న వెనుక‌బ‌డిన వ‌ర్గాలు..!!

  కాంగ్రెస్ వ్య‌వ‌హారం బాగాలేదు..! ఎలా అని ప్ర‌శ్నిస్తున్న వెనుక‌బ‌డిన వ‌ర్గాలు..!!

  ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ జాబితా రెండవ కూర్పుపైన కూడా నిర‌శ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 10 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను బుధవారం ఉదయం విడుదల చేసింది. ఈ జాబితాలో ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఎల్లారెడ్డి నించి జాజల సురేందర్, ధర్మపూరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిరిసిల్ల కేకే.మహేందర్ రెడ్డి, మేడ్చల్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ పీ.విష్ణువర్దన్ రెడ్డి, షాద్ నగర్ సీ.ప్రతాప్ రెడ్డి, భూపాలపల్లి గండ్ర వెంకటరమణా రెడ్డి, పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు

  English summary
  The party also released a list of the first list of Congress candidates in the Telangana Assembly elections. The list comprises of 65 people, with 23 reddy community candidates and 6 in the second list. According to the prosecution, the BC's has not given priority to the list.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X